హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందని నమ్మించి…నగరానికి చెందిన ఓ ఇన్వెస్టర్‌ను కోటీ నలభై లక్షలు మోసం చేసినందుకు నగర సైబర్ క్రైమ్ అధికారులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ ఆకాష్ వర్మను అరెస్టు చేశారు. తెలంగాణలో నాలుగు కేసులతో సహా భారతదేశం అంతటా 30 కేసుల్లో వర్మ నేరస్థుడని పోలీసులు తెలిపారు.
నిందితుడు… బాధితుడికి లింక్ పంపి చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించడం ద్వారా ప్రలోభపెట్టాడు, అది క్రమంగా గణనీయమైన మొత్తాలకు పెరిగింది. ప్రారంభంలో నమ్మకం కుదిరేందుకు లాభాలు చూపించాడు. తర్వాత వర్మ, అతని సహచరులు మొత్తం లాభంలో 10 శాతం డిమాండ్ చేశారు, దీనితో బాధితుడు మరిన్ని డిపాజిట్లు చేయవలసి వచ్చింది చివరికి మొత్తం రూ.1.4 కోట్లు డిపాజిట్ చేశాడు.
ఈ క్రమంలో బాధితుడు తన నిధులను స్టాక్‌మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత, అతను ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయకుండా స్కామర్లు నిరోధించారు. అన్ని కమ్యూనికేషన్‌లు ఆపేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాదీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లపై కొనసాగుతున్న చర్యలలో భాగంగా వర్మను గుర్తించి అరెస్టు చేశారు. నగరం, దేశవ్యాప్తంగా బాధితులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగించే అధునాతన పెట్టుబడి మోసాల క్రమంలో ఈ కేసు ఒక భాగమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ పెట్టుబడి అవకాశాలతో ఎవరైనా మిమ్మల్న సంప్రదించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నిధులను బదిలీ చేసే ముందు అటువంటి పథకాల చట్టబద్ధతను ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.