28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఆక్రమిత తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్‌ కవాతు… తీవ్ర ఉద్రిక్తత!

జెరూసలేం: ఆక్రమిత తూర్పు జెరూసలేం యొక్క పాత నగరానికి సమీపంలో ఉన్న బాబ్ అల్ అముద్ ప్రాంతంలో (డమాస్కస్ గేట్) వేలాది మంది ఇజ్రాయెల్ స్థిరనివాసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య నగరం గుండా ఫ్లాగ్ మార్చ్‌ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

1967లో ఇజ్రాయెల్ ఈ నగరాన్ని ఆక్రమించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ, సెటిలర్లు జెరూసలేంను ఏకీకృతం చేసే రోజుగా ఆదివారం మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సహజంగానే పాలస్తీనియన్లను రెచ్చగొట్టింది. అధిక సంఖ్యలో యూద సమూహాలు నగరంలో ఉద్రికత్త చోటుచేసుకునేలా ముస్లిం సముదాయాల వద్ద ఈ మార్చ్‌ను నిర్వహించారు. ఈ బలప్రదర్శన కొత్త హింసాకాండకు దారితీసే ప్రమాదం నెలకొంది.

దీంతో ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని స్థిరనివాసులు, పాలస్తీనియన్ నివాసితుల మధ్య కొట్లాటలు జరగకుండా… ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం కోసం వేలాది మంది పోలీసులను, భద్రతా బలగాలను మోహరించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో ఇజ్రాయెల్ పోలీసులు, సెటిలర్లు జరిపిన దాడుల్లో కనీసం 62 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.

నగరంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ పోలీసులు లాఠీలు ప్రయోగించారని, రబ్బరు పూతతో కూడిన బుల్లెట్లు, టియర్ గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారని పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున, వందలాది మంది ఇజ్రాయెల్ స్థిరనివాసులు ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని అల్ అక్సా మసీదు సముదాయంలోకి బలవంతంగా ప్రవేశించారు.

జాత్యహంకార నినాదాలు
ఓల్డ్ సిటీకి అవతలి వైపున ఉన్న యూదు క్వార్టర్‌లోని వెస్ట్రన్ వాల్‌కు వెళ్లే ముందు, ముస్లిం క్వార్టర్ గుండా సాగే మార్చ్‌లో వేల మంది సాధారణంగా పాల్గొంటారు.ఇటీవల ఆ ప్రాంతాల్లో అశాంతి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ నాయకులు ఈ సంవత్సరం కవాతును ఎప్పటిలాగే ముస్లిం నివాస ప్రాంతాల మధ్య నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సెటిలర్లు పాలస్తీనియన్లు, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్‌ (సఅ)కు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.పాతబస్తీలోకి ప్రవేశించే ముందు ఒక పెద్ద సమూహం “అరబ్బులకు మరణం”, “మీ గ్రామం కాలిపోనివ్వండి” అని నినాదాలు చేసింది.

గత సంవత్సరం ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘర్షణలు గాజాపై 11 రోజుల ఇజ్రాయెల్ దాడికి దారితీశాయి, ఈ సమయంలో 260 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. యుద్ధ సమయంలో గాజా నుండి పాలస్తీనా కాల్పుల్లో 13 మంది ఇజ్రాయెల్‌లు కూడా మరణించారు. ఈజిప్టు మధ్యవర్తిత్వ సంధితో సంవత్సరం పాటు సాగిన అత్యంత దారుణమైన హింస ఆగిపోయింది.

1967లో ఆరు రోజుల యుద్ధంలో అల్ అక్సా మసీదు ఉన్న తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించింది. 1980లో అంతర్జాతీయ సమాజం ఆమోదించనప్పటికీ మొత్తం నగరాన్ని స్వాధీనం చేసుకుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles