న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డ వ. ఈ దాడి తరువాత, మితవాద మీడియాగ్రూపులు, ప్రధాన స్రవంతి మీడియా టీవీ, సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక కథనాలను వ్యాప్తి చేశాయి, ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి.
ద్వేషం, తప్పుడు సమాచారం, ఉదాసీనత
యావద్దేశం ఉగ్రదాడిపై సంతాపం వ్యక్తం చేస్తుండగా, హిందూత్వ గ్రూపులు సోషల్ మీడియాలో ముస్లింలపై హింసకు బహిరంగంగా పిలుపునిచ్చాయి. అనేకమంది నెటిజన్లు కాశ్మీర్‌కు “ఇజ్రాయెల్ లాంటి పరిష్కారం” కావాలని Xలో బహిరంగంగా పిలుపునిచ్చాయి. విచారకరమైన విషమేంటంటే… చాలా మంది ఈ హేయమైన ఆలోచనను ప్రశంసించారు. మరికొందరు “ఉగ్రవాదానికి ఒక మతం ఉంది” అని రాశారు. వివిధ సైట్లలో ద్వేషపూరిత ప్రచారాలలో చురుకుగా పాల్గొన్నారు.
ప్రైమ్ టైమ్ చర్చల్లో యాంకర్లు… దాడి గురించి ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ మరింత ఆజ్యం పోశారు. యాంకర్లలో ఒకరు “తుది పరిష్కారం ఉండాలి” అని ప్రస్తావించడం వినిపించింది.
ముస్లింలపై విషం చిమ్మడంలో ముందుండే ‘ది జైపూర్ డైలాగ్స్’ వంటి ఇంటర్నెట్ ఖాతాలు “ఇస్లాం హింసాత్మకమని నువ్వు అన్నావు? నేను నిన్ను చంపేస్తాను” అనే క్యాప్షన్‌తో ముస్లిం పురుషుల చిత్రాలను పోస్ట్ చేశాయి.
తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంలో ఆరితేరిన హిందూత్వ వెబ్సైట్ ఎడిటర్ నూపుర్ శర్మ…ఈ ఉగ్ర దాడిని ఖండిస్తూ కాశ్మీరీలు నిర్వహించిన కొవ్వొత్తి మార్చ్‌కు ప్రతిస్పందనగా… “ఎవరూ పట్టించుకోరు. మీ కొవ్వొత్తులను పక్కనబెట్టండి. అలాగే మీ ఆపిల్లను, మీ శాలువాలను, మీ కాశ్మీరియత్‌ను ఉండనివ్వండి . రక్తపాత నాటకాన్ని ఆపండి” అని పోస్ట్ చేశారు. ఆనంద్ రంగనాథన్ ట్వీట్ చేస్తూ… “ఉగ్రవాదానికి మతం లేదు. అందుకే పహల్గామ్ ఉగ్రవాదులు పర్యాటకుల ఐడి కార్డులను తనిఖీ చేసి, వారి ప్యాంటును కిందకి దింపి, కల్మా పారాయణం చేయమని అడిగారు, ముస్లింలు కాని వారిని చంపారంటూ నెటిజన్ల మనసులో మరింత విద్వేషం నింపారు.
దాడి చేసినవారు మతం ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి అనేక మంది వినియోగదారులు ఇదే విధంగా పోస్ట్ చేశారు. ఈ ద్వేషపూరిత ప్రచారం భారతదేశం అంతటా, ముఖ్యంగా కాశ్మీర్లో ముస్లింల భద్రతపై చర్చలను రేకెత్తించింది.
తరువాతి పరిణామాలు
పహల్గామ్ దాడి పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడులలో ఒకటి అని నివేదికలు చెబుతున్నాయి. తక్షణమే స్పందించిన మన భద్రతా దళాలు… నిందితుల కోసం వెతుకులాట కొనసాగిస్తుండగా, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది.
బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి మరియు సంతాపాన్ని వ్యక్తం చేయడం వెంటనే ప్రారంభమైంది. ఈ దాడిని “హేయమైనది”గా అభివర్ణించిన నరేంద్ర మోడీ, బాధితులను న్యాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముస్లిం సంస్థలు కూడా దాడిని ఖండించాయి. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వంటి నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కాగా, ఎవరికి అంతగా తెలియని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ దాడికి బాధ్యత వహించింది, కశ్మీర్లో బయటి వ్యక్తుల రాక, కలవరపెడుతోందని పేర్కొంది.