లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని బ్లింకిట్‌లో సుమారు 150 మంది గిగ్ కార్మికులు గత వారాంతంలో శని, ఆదివారం నాడు రెండు రోజుల సమ్మెకు దిగారు. న్యాయమైన పరిహారం, మెరుగైన పని పరిస్థితులు, వేసవి వాతావరణానికి తగిన కాటన్ యూనిఫాంలు కావాలని డిమాండ్ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా, జొమాటో యాజమాన్యంలోని కంపెనీ… సమ్మెలో పాల్గొన్న 150 మంది వ్యక్తుల ఐడీలను బ్లాక్ చేసింది, వారి ఐడీలను తిరిగి పొందే ముందు ఒప్పందంపై సంతకం చేయాలని కోరింది.
తమతో మాట్లాడటానికి, కలవడానికి బదులుగా, జొమాటో యాజమాన్యంలోని కిరాణా డెలివరీ యాప్ వారి IDలను సస్పెండ్ చేసి, నిరసన రహిత ఒప్పందాలపై సంతకం చేయమని బలవంతం చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని నిరసన తెలుపుతున్న కార్మికులు ఫిర్యాదు చేస్తున్నారు. “డెలివరీ కార్మికులను దోపిడీ చేయడం ఆపండి. మా డిమాండ్లను వినండి” అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
గిగ్, ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) సమన్వయంతో జరిగిన ఈ ప్రదర్శన, కార్మికులు దోపిడీ ప్రక్రియలుగా పేర్కొన్న వాటిపై దృష్టి సారించింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరి షిఫ్ట్‌లను రద్దు చేయడం, కనీస చెల్లింపు మొత్తాన్ని పెంచడం తాగునీరు, వేచి ఉండే ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటి ప్రధాన డిమాండ్లను తీర్చాలంటున్నారు.
GIPSWU జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా, వారణాసిలోని శ్రీరామ్ కాలనీలో ఏప్రిల్ 26న సమ్మె ప్రారంభమైందని వివరించారు. కంపెనీ ప్రతిచర్య, శిక్షార్హంగా ఉందని, మరుసటి రోజు 150 మంది కార్మికులను బహిష్కరించారని ఆయన ఆరోపించారు.
ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసు చర్యతో బెదిరిస్తున్నారని, మళ్ళీ సమ్మె చేయబోమని హామీ ఇచ్చే అఫిడవిట్లపై సంతకం చేయమని కోరుతున్నారని GIPSWU ఆరోపించింది.
ఈ పరిస్థితిపై మాజీ జొమాటో ఉద్యోగి ఒకరు రెడ్డిట్‌లో మాట్లాడుతూ…ఇది డిన్నర్ షిఫ్ట్‌ల కంటే, డే షిఫ్ట్ బోనస్‌లు ఎక్కువగా ఉన్నాయని, కానీ వాటికి డెలివరీ లక్ష్యాలు, తప్పనిసరి పని గంటలు కూడా చాలా కష్టతరమైనవి. రైడర్లు ప్రోత్సాహకాలు పొందడానికి మధ్యాహ్నం 12-4 గంటల షిఫ్ట్‌లో, రాత్రి 8-10 గంటల షిఫ్ట్‌లో కనీసం మూడు గంటలు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
గిగ్, ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ప్రకారం…బ్లింకిట్ సస్పెండ్ చేయబడిన కార్మికులను ఎటువంటి చట్టపరమైన వివరాలు ఇవ్వకుండా, అధికారిక లెటర్హెడ్లపై ముద్రించని, తేదీ లేని పత్రాలపై సంతకం చేయమని కోరింది. రుజువుగా పత్రాన్ని బిగ్గరగా చదివి వినిపించమని ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం.
ఉద్యోగులపై ఒత్తిడి ఉన్నప్పటికీ, తమ డిమాండ్ల పట్ల ఉద్యోగులు దృఢంగా ఉన్నారని గిగ్, ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) పేర్కొంది. “మేము అంతరాయం కలిగించడానికి సమ్మె చేయలేదు, మా గోడు వినడానికి సమ్మె చేసాము” అని సమ్మెచేసిన కార్మికుల్లో ఒకరు తెలిపారు. “మమ్మల్ని గౌరవంగా, న్యాయంగా చూడాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.