మంగళూరు : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత హిందువులు ఆత్మరక్షణ కోసం కత్తులు ఉంచుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కల్లడ్క ప్రభాకర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రతి హిందూ కుటుంబం కత్తి దగ్గర పెట్టుకోవాలి. పహల్గామ్ దాడి జరిగినప్పుడు హిందువులు కత్తి చూపిస్తే సరిపోయేది” అని అన్నారు.
మహిళలు తమ సాధారణ వస్తువులతో పాటు తమ వ్యానిటీ బ్యాగుల్లో కత్తులను తీసుకెళ్లాలని కూడా ఆయన కోరారు. ఆరు అంగుళాల కత్తి తీసుకెళ్లడానికి ‘లైసెన్స్’ అవసరం లేదని, “మీరు సాయంత్రం తర్వాత బయటకు వస్తే, దాడి జరిగే అవకాశం ఉంది. దాడి చేసేవారిని వేడుకోకండి – కత్తిని చూపించండి, వారు పారిపోతారు” అని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అన్నారు.
ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో దృష్టిని ఆకర్షించాయి. గతంలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ భట్ ఇలా అన్నారు,
మత ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ ప్రభాకర్, “హిందూ-ముస్లిం ఘర్షణల సమయంలో, హిందువులు భద్రత కోసం భయపడి పారిపోతారు, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మనం మేల్కోవాలి. ఇళ్ల వద్ద కత్తి ఉంచుకోవాలి” అని అన్నారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇంకా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు.