హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బిఐ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తులో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ, అగ్ని కీలలు భవనం నుంచి ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసాయి. అయితే మూడు ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. భవనం చుట్టూ భారీగా పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అయితే, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా కృషి చేసారు.
సెలవు రోజు కావడంతో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాద ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకుని బ్యాంక్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. విలువైన పైల్స్ దగ్థమైన్నట్లు సమాచారం… బిల్డింగ్‌లో ఎవరూ లేకపోవడం, సండే సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.