న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వివాదం మరింత తీవ్రమవుతున్నందున…విమాన ప్రయాణీకులకు అత్యవసర సూచనలు జారీచేసింది. ఈమేరకు ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ సమయానికన్నా ముందుగానే చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర విమానయాన సంస్థలు సూచించాయి.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల దృష్ట్యా, “భారతదేశం అంతటా ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ చేసిన నిష్క్రమణకు కనీసం మూడు గంటల ముందు చేరుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో సూచించారు”. విమానం “బయలుదేరడానికి 75 నిమిషాల ముందు చెక్-ఇన్ ముగుస్తుంది” అని ఎయిర్ ఇండియా తెలిపింది.
జమ్మూతో పాటు పశ్చిమ సరిహద్దుకు సమీపంలో ఉన్న అనేక సైనిక స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులను భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఈ సూచన జారీ అయింది. .
ఇండిగో సైతం ప్రయాణికులను మెరుగైన భద్రతా చర్యల కోసం కొంత అదనపు సమయం ఇవ్వాలని Xలోని ఒక పోస్ట్‌లో అభ్యర్థించింది. “ఈ అసాధారణ సమయాల్లో, అన్ని విమానాశ్రయాలలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా తనిఖీలు లాంఛనాలకు అనుగుణంగా మీ ప్రయాణానికి కొంత అదనపు సమయం ఇవ్వమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ అవగాహన, సహకారాన్ని మేము కోరుకుంటున్నామని పోస్ట్ చేసింది.
అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణీకులందరూ” సెకండరీ లాడర్ పాయింట్ సెక్యూరిటీ చెక్ (ఎల్సీఎస్సీ) చేయించుకోవాల్సి ఉంటుంది. టెర్మినల్ భవనాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించినట్టు, అందుకు అనుగుణంగా ఎయిర్ మార్షల్స్ ను నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా భారతదేశంలోని 28 విమానాశ్రయాలను శనివారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 90 విమానాలు రద్దయ్యాయి.
గురువారం ప్రారంభంలో దేశీయ విమానయాన సంస్థలు దాదాపు 430 విమానాలను రద్దు చేశాయి, ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్ చేసిన విమానాలలో దాదాపు మూడు శాతం, ఎందుకంటే 27 విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేశారు.
ప్రభావిత విమానాశ్రయాలలో శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లూధియానా, పాటియాలా, బఠిండా, హల్వారా, పఠాన్‌కోట్, భుంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్, కాండ్లా, కేశోడ్, భుజ్, గ్వాలియర్, హిండన్ ఉన్నాయి. ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు మరికొన్ని విమానాశ్రయాలు జాబితాలో చేర్చారు.