న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అందించే బెయిలౌట్‌పై మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. అలా కాకుండా దీనిని”బలంగా తిరస్కరించి ఉంటే” శక్తివంతమైన సంకేతాన్ని పంపి ఉండేదని విపక్ష పార్టీ పేర్కొంది.
ఏప్రిల్ 29న జరిగిన బహుపాక్షిక సంస్థ కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో IMF 1.3 బిలియన్ల రుణ ప్రతిపాదనను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ ఆశించినట్లు పార్టీ తెలిపింది.
“ఏప్రిల్ 29న, INC పాకిస్తాన్‌కు IMF రుణాన్ని భారతదేశం వ్యతిరేకించాలని డిమాండ్ చేసింది, ఈరోజు దాని ఎగ్జిక్యూటివ్ బోర్డు దీనిని పరిగణించింది. భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది. మోడీ ప్రభుత్వం భయపడింది అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ ‘X’లో పోస్ట్ చేశారు.
కాగా ఐఎంఎఫ్ పాకిస్తాన్‌కు అందించే బెయిల్ అవుట్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. ఐఎంఎఫ్ నిధులను ఉగ్రవాదానికి ఉపయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
మే 9న వాషింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో… IMF సహాయానికి సంబంధించిన షరతులను పాకిస్తాన్ పదేపదే పాటించడంలో విఫలమైందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌కి ఆర్థిక సహాయం పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు, భారతగడ్డపై దాడులకు కుట్ర పన్నడానికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు మద్దతు ఇస్తుందని భారత్ చెప్పింది. సీమాంతర ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోని పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందించడంలో జాగ్రత్త వహించాలని భారత్ కోరింది.
ఐఎంఎఫ్ నిర్ణయం ప్రపంచ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని పంపుతుందని, నిధుల సంస్థలు, దాతల ప్రతిష్టకు ముప్పు కలిగిస్తుందని, ప్రపంచ విలువలను అపహాస్యం చేస్తుందని భారతదేశం IMF సమావేశంలో ఎత్తి చూపిందని అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
“భారతదేశం చేసిన ప్రకటనలను, ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని IMF గమనించింది” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా మాట్లాడుతూ… “మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా, పాకిస్తాన్‌కు కొత్తగా IMF రుణాలను వ్యతిరేకించడానికి ఇతర సభ్యులతో లాబీయింగ్ చేస్తుందని కూడా భావించారు. కానీ మోడీ ప్రభుత్వం ఓటింగ్‌కు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎంచుకుంది” అని అన్నారు.