28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నిద్రమత్తులో వక్ఫ్ బోర్డు… భూ కబ్జాదారులను పట్టుకోవడంలో విఫలం!

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పడి నాలుగు నెలలైనా.. సక్రమంగా సమావేశాలు జరగకపోవడంతో బోర్డుకు సంబంధించిన సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదు. వక్ఫ్ సమస్యలపై చర్చించడానికి 2021 సెప్టెంబర్‌లో బోర్డు అధికారికంగా సమావేశమైంది. అప్పటి ఛైర్మన్ మహమ్మద్ సలీమ్ అధ్యక్షత వహించారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన సభ్యుల సమావేశం జరిగినప్పటికీ, కొత్తగా ఎన్నికైన చైర్మన్ మసీవుల్లా ఖాన్‌కు సభ్యులను పరిచయం చేయడం, అధికారాల అప్పగింతకు ఇది చాలా వరకు పరిమితమైంది.

సయ్యద్ ఇఫ్తెకార్ షరీఫ్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసుల చట్టపరమైన విచారణలను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా వక్ఫ్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.   ప్రాధాన్యతా అంశంలో చర్చించాల్సిన అనేక ఇతర అంశాలు కూడా వాటి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. వక్ఫ్ బోర్డు సాధారణ సమావేశాలు జరగక పోవడంతో భూ కబ్జాదారులు, కంట్రాక్టర్లు లోలోపల సంతోషపడుతున్నారు.

నిబంధనల ప్రకారం, సమస్యలపై చర్చించడానికి ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేయాలి. కొత్త బోర్డు ఫిబ్రవరి 2022లో ఏర్పాటైంది. అయితే గత నాలుగు నెలల్లో బోర్డుకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి అధికారిక సమావేశాలు ఏవీ జరగలేదు. మే 7న కేవలం సభ్యుల పరిచయం,  కొత్త చైర్మన్‌లకు అధికారాలు ఇవ్వడం మాత్రమే జరిగిందని సామాజిక కార్యకర్త వాపోయారు.  బోర్డు పనితీరులో పారదర్శకత తీసుకువస్తామని కొత్తగా ఎన్నికైన చైర్మన్ మసూయుల్లా ఖాన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కొత్తగా ఎన్నికైన బోర్డు క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి న్యాయపరమైన అంశాలను చేపట్టాలని, వక్ఫ్ బోర్డుకు పెద్దపీట వేస్తూ పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడంతో పాటు సమస్యలపై చర్చించాలని సామాజిక కార్యకర్త షరీఫ్ కోరారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టులను కొన్నేళ్లుగా ఖాళీగా ఉంచడం పెద్ద తప్పని, మైనారిటీ సంస్థలలో ఇది ఓ ట్రెండ్‌గా మారిందని అన్నారు.

‘‘2018 నుంచి వక్ఫ్‌ బోర్డులో సీఈవో పోస్టు ఖాళీగా ఉంది. మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీంకు అదనపు బాధ్యతగా వక్ఫ్ బోర్డు  సీఈవో పోస్టు కేటాయించారు. అలాగే  తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సెక్రటరీకి అదనంగా తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ సీఈవో పదవిని అప్పగించారు.  ఈ డిప్యూటేషన్ల పద్ధతిని తొలగించి రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు, హజ్‌ కమిటీకి శాశ్వత ప్రాతిపదికన సీఈఓలను నియమించాలని సామాజిక కార్యకర్త షరీఫ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles