28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం… గొల్ల, కురమ వర్గాలకు కామథేనువు!

  • గొల్ల, కురుమ వర్గాలకు సబ్సిడీ ద్వారా గొర్రెల పంపిణీ
  • 2017లో గజ్వేల్‌లో ఈ పథకం లాంచ్
  • గొర్రెల పంపిణీ పథకం ద్వారా రూ.7,800 కోట్ల ఆదాయం
  • గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం

హైదరాబాద్: గొల్ల, కురమ వర్గాల వారు తమ సంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 2017 జూన్ 20న రూ.12 వేల కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో యూనిట్ కింద 21 గొర్రెలను ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగి రాజస్థాన్‌ను అధిగమించి, దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఈ పథకం గొర్రెల పెంపకందారులకు కామథేనువుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వారి విజయగాథలు అన్నీ ఇన్నీ కావు.

నల్గొండ అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన బోయిన భూలక్ష్మి. ఆమె భర్త చంద్రయ్య 2017లో మరణించడంతో తన కుమార్తె వివాహాన్ని జరిపించడం,  తన ఇద్దరు కుమారులను చదివించాల్సిన భారం ఆమెకు భారంగా పరిణమించింది. తల్లిదండ్రులు రంగంలోకి దిగి ఆమె జీవనభృతి కోసం 20 గొర్రెలు ఇచ్చారు.  గొర్రెల పెంపకం ద్వారా వచ్చిన డబ్బు రెండు పూటలా తిండికే సరిపోయింది. ఇక అమ్మాయి పెళ్లి, పిల్లల చదువులు ఎలా అనే ఆలోచన ఆమెను పట్టిపీడించ సాగింది. దీంతో  ఆమె..  రాష్ట్రంలోని గొర్రెల కాపరుల ఆర్థిక స్వావలంబన లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో ప్రారంభించిన ప్రత్యేక సబ్సిడీతో కూడిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో చేరారు.

ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం భూలక్ష్మికి 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించింది, ఈ పథకం కింద రూ. 1.25 లక్షల వ్యయం అవుతుంది. ప్రభుత్వం ఆమెకు 206 కిలోల దాణా, రూ.400 విలువైన మందులను కూడా అందించింది. స్థానిక పశువైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూలక్ష్మి గొర్రెల మందను 100 శాతం బతికించగా ఆరునెలల్లో 15 ఆడ, 25 మగ గొర్రెతో సహా 40 గొర్రెలకు జన్మనిచ్చాయి. భూలక్ష్మి 23 మగ గొర్రె పిల్లలను ఐదు నుండి ఏడు కిలోల బరువుకు చేరుకున్నప్పుడు వాటిని విక్రయించింది. సంతానోత్పత్తి కోసం రెండింటిని తనవద్దే అట్టిపెట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఏడాదికి రూ.2.25 లక్షలు సంపాదిస్తోంది.

ఒక్క భూలక్ష్మి విజయగాథే కాదు…  గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వందలాది కుటుంబాలకు ఈ పథకం ఒక వరంలా మారింది. ఇప్పటికే ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్యుత్ సహా వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ మాంసం ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవ కారణంగా మాంసం ఉత్పత్తి 2014-15లో 5,05,000 టన్నుల నుంచి 2019-20 నాటికి 8,48,000 టన్నులకు భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాంసం ఉత్పత్తి ఏటా దాదాపు 40,000 నుంచి 50,000 టన్నులు పెరిగేలా చేసింది. 2015-16లో మాంసం ఉత్పత్తి 5,42,000 టన్నులు, 2016-17లో 5,91,000 టన్నులు, 2017-18లో 6,45,000 టన్నులు, 2018-19లో 7,54,000 టన్నులు, 2018-19లో 7,54,000 టన్నులు. 8,48,000 టన్నులకు పెరిగింది.

రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ తర్వాత, తెలంగాణ దేశంలోనే ఉన్ని ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. 2019-20లో రాష్ట్రంలో 3,96,000 కిలోల ఉన్ని ఉత్పత్తి అయింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. గొల్ల, కురమ వర్గాలకు గొర్రెలను పంపిణీ కార్యక్రమం ద్వారా ఆయా వర్గాలు  లాభాలు పొందేందుకు ఈ పథకం ఎంతగానో సాయపడుతోంది.

రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ (NCDC) సహాయం కింద తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ గొర్రెల కాపరుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో విభిన్న కార్యక్రమాలను చేపడుతోంది.

ప్రస్తుతం, 7,61,895 మంది సభ్యుల నమోదుతో 8,109 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు (PSBCS) ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, గొర్రెల కాపరులకు స్థిరమైన జీవనోపాధిని కల్పించే సాధనంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఫేజ్ I కింద 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల యూనిట్ వ్యయంతో మొత్తం రూ.5,000 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఒక కుటుంబానికి 20 గొర్రెలను పంపిణీ చేశారు.

ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 82.39 లక్షల గొర్రెలను సేకరించి, 3.92 లక్షల మంది పీఎస్‌బీసీఎస్‌ సభ్యులకు పంపిణీ చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీగా రూ. 3,735.24 కోట్ల వ్యయాన్ని భరించగా, మిగిలిన ఖర్చు రూ. 1245.07 కోట్లను లబ్ధిదారులు 25 శాతం వాటాగా భరించారు. గొర్రెల పంపిణీ పథకం అమలుకు మొత్తం రూ.4,980.31 కోట్లు ఖర్చు చేశారు. ఈ చొరవ ఫలితంగా, రాష్ట్రంలో గొర్రెల జనాభా 1.28 కోట్ల నుండి 1.91 కోట్లకు పెరిగింది మరియు ఇది 20వ పశుగణన ప్రకారం కేంద్ర ప్రభుత్వంచే నిర్ధారించబడింది. ఇప్పటి వరకు 1.30 కోట్ల గొల్ల కురుమలు పుట్టగా, పుట్టిన గొర్రె పిల్లల ద్వారా రూ.6,500 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles