గహవటి : జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అస్సాం ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది. సోనిత్పూర్ జిల్లా నుండి మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 58కి చేరుకుంది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ముఖ్యమంత్రి ఇలా రాశారు, “58 మంది పాక్ సానుభూతిపరులు జైలులో ఉన్నారు. వారి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకుగాను వారికి శిక్ష తప్పదు.”
58 Pak sympathizers are now BEHIND BARS.
— Himanta Biswa Sarma (@himantabiswa) May 13, 2025
Continuing with the state wide crackdown on traitors, @SonitpurPolice today arrested
1️⃣Fazal Ali
2️⃣Sukur Ali
They will also receive special care for their anti-national activities.
Nobody will be spared.
ఇలాంటి దేశద్రోహులపై కఠిన చర్యలు కొనసాగుతాయని, “ఎవరినీ వదిలిపెట్టబోమని” ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులు ఎక్కువగా సందర్శించే బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేసి 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పటి నుండి అస్సాంలో ముస్లిం యువకుల అరెస్టుల ఎక్కువయ్యాయి.
ముస్లిం యువకులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్నారని అరెస్టయిన వారిలో చాలామంది ఆరోపించారు.
ఆ ముస్లిం యువకులు సోషల్మీడియాలో “షేర్ చేసిన విషయాలలో చాలా వరకు యుద్ధ వ్యతిరేకమైనవి, కొన్ని ప్రభుత్వాన్ని విమర్శించేవి, మరికొన్ని శాంతికి పిలుపులు. వీటిని పాకిస్తాన్ అనుకూల, దేశ వ్యతిరేకమైనవిగా ఎలా ముద్ర వేయవచ్చు?” అని గౌహతికి చెందిన ఒక పరిశోధకురాలు అడిగారు.
“అస్సాం ప్రభుత్వం, ముఖ్యమంత్రి ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవడంలో అపఖ్యాతి పాలయ్యారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడంలో తాను సంతోషంగా ఉన్నానని ఆయన చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు” అని ఆమె జోడించారు.
గత వారం జరిగిన విలేకరుల సమావేశంలో, అరెస్టు చేసిన వారిలో కొందరిపై జాతీయ భద్రతా చట్టం (NSA)లోని కఠినమైన నిబంధనల కింద కేసు నమోదు చేస్తామని శర్మ ప్రకటించారు. అదుపులోకి తీసుకున్న వారిలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం కూడా ఉన్నారు. ఆయనపై పహల్గామ్ సంఘటనలో పాకిస్తాన్ను సమర్థించి, దాని పాత్రను ఖండించినందుకు దేశద్రోహం కేసు కూడా నమోదు చేసారు.