32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ట్యాంక్ బండ్‌పై 150 ఏళ్ల నాటి పోలీస్ అవుట్‌పోస్ట్… త్వరలో పునరుద్ధరణ!

హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై గతంలో ఉన్న గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ అవుట్‌పోస్ట్‌ను పునరుద్ధరించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీంతో ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై త్వరలో మరో ఆకర్షణీయ కట్టడంగా రూపొందనుంది.

కొంత చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ఈ కట్టడం ట్యాంక్ బండ్ పేవ్‌మెంట్‌పైనే ఉంది. ప్రస్తుతం దీనిని ఏ శాఖ కూడా వినియోగించడం లేదు. ఈ భవనాన్ని పూర్తిగా రాతితో నిర్మించడం విశేషం. దీనికి అనుబంధంగా పార్కింగ్ ప్రాంతం కూడా ఉంది. పురాతత్వ ఔత్సాహికుడు, ఆర్కిటెక్ట్ ఆసిఫ్ అలీ ఖాన్ నుంచి వచ్చిన సూచనపై ట్విట్టర్‌లో స్పందిస్తూ, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ దీనికి స్పందించారు. ఔత్సాహికుడి సూచనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

పునరుద్ధరణ తర్వాత కూడా ఈ నిర్మాణాన్ని పోలీసులు ఉపయోగించుకోవచ్చని ఆర్కిటెక్ట్ ఖాన్ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

“@arvindkumar_ias సార్, ఈ చారిత్రాత్మకమైన, ఈ పురాతత్వ భవనాన్ని పునరుద్ధరించాలని అభ్యర్థిస్తున్నాను. “సుమారు 150 సంవత్సరాల క్రితం పోలీసు చెక్ పోస్ట్ ఉంది, అవకాశం ఇస్తే ట్యాంక్ బండ్ పోలీస్ పెట్రోలింగ్ స్టేషన్‌గా పూర్తిగా పునరుద్ధరించబడుతుంది” అని ఆర్కిటెక్ట్ ఆసిఫ్ అలీ ఖాన్ ట్వీట్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles