న్యూయార్క్ : “ఇజ్రాయెల్ అమానవీయ దాడులు, ఆకలి మా పిల్లలను కబళిస్తున్నాయని” ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ విలపించారు, గాజాలో ఇజ్రాయెల్ సైనిక మారణకాండను ఖండించారు. పిల్లల ప్రాణనష్టం గురించి హృదయ విదారక కథనాలను పంచుకున్నారు.
గాజాలో తీవ్రతరం అవుతున్న మానవతా సంక్షోభం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాలస్తీనా కుటుంబాల బాధలను వివరిస్తూ, ప్రసంగం మధ్యలో మన్సూర్ తన భావోద్వేగాలను అణచుకోవడానికి చాలా కష్టపడ్డారు. డజన్ల కొద్దీ పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. తల్లులు తమ కదలని శరీరాలను కౌగిలించుకుని, జుట్టును పట్టుకుని, వారితో మాట్లాడుతూ, వారికి క్షమాపణలు చెబుతున్న దృశ్యాలు భరించలేనివి. ఈ దుఃఖాన్ని ఎవరైనా ఎలా తట్టుకోగలరు?” అతను గద్గద స్వరంతో అన్నారు.
“నాకు మనవళ్లు ఉన్నారు. పాలస్తీనియన్ కుటుంబాల పట్ల ఇజ్రాయెలీల ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దమనకాండపై ప్రపంచం చలించకుండా ఉంటోంది. అయితే పాలస్తీనియన్ల బాధలను చూడటం ఏ సాధారణ మానవుడైనా భరించలేడని ఆయన భావోద్వేగంతో తన ముందు ఉన్న డెస్క్‌ను కొట్టి మరి తన బాధను ఐక్యరాజ్యసమితి ముందు వ్యక్తపరిచాడు.
“మంటలు, ఆకలి పాలస్తీనా పిల్లలను మింగేస్తున్నాయి. అందుకే మేము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము – ప్రతిచోటా పాలస్తీనియన్లుగా, మాలో 14 మిలియన్ల మంది, ఆక్రమిత ప్రాంతాలలో, డయాస్పోరాలో, శరణార్థి శిబిరాల్లో…” అని ఆయన అన్నారు.
మార్చి కాల్పుల విరమణ విఫలమైనప్పటి నుండి పెరుగుతున్న ప్రాణనష్టాన్ని మన్సూర్ ఉదహరించారు: “1,300 మందికి పైగా పాలస్తీనా పిల్లలు మరణించారు. దాదాపు 4,000 మంది గాయపడ్డారు. “మేము మా పిల్లలను ప్రేమిస్తున్నాము. మేము మా ప్రజలను ప్రేమిస్తున్నాము. వారు ఈ విషాదం, ఈ క్రూరమైన దాడులను ఎదుర్కోవడం మాకు ఇష్టం లేదు.”
“నేను మీకు హామీ ఇస్తున్నాను, పాలస్తీనాలో పాతుకుపోయిన ఆలివ్ చెట్ల కంటే, రోమన్ చెట్ల కంటే ఎక్కువగా మేము పాలస్తీనాలో ఎక్కువగా పాతుకుపోయాము. మేము ఎప్పటికీ దూరంగా ఉండము. మేము ఎండిపోము. మేము మా మాతృభూమిలోనే ఉంటామని” ఆయన అన్నారు.
“ఏదైనా చేయండి. పాలస్తీనా ప్రజలపై ఈ నేరం కొనసాగకుండా ఆపండి, ఈ మారణహోమాన్ని ఆపండి దీని భద్రతా మండలిని చర్య తీసుకోవాలని పాలస్తీనా రాయబారి మన్సూర్ డిమాండ్ చేశారు: