భువనేశ్వర్: ఒరిస్సాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) లంచం కేసులో అరెస్టు చేసింది.
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి అయిన రఘువంశీ భువనేశ్వర్‌లోని ఒక మైనింగ్ వ్యాపారి నుండి 20 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ట్రాప్ ఆపరేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. CBI న్యాయవాది ప్రకారం… మొత్తం రెండు కోట్ల లంచం డిమాండ్‌లో భాగంగా మొదటి విడతగా రూ. 20 లక్షలు అందుకున్నాడు. ఈ క్రమంలో మేము అతన్ని అరెస్టు చేసాము. ఇప్పుడు అతన్ని జ్యుడీషియల్ కస్టడీలో జైలుకు పంపారు” అని CBI న్యాయవాది తెలిపారు. కాగా, కోర్టు రఘువంశీని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణ కోసం జూన్ 4న ఈ కేసును వాయిదా వేసింది.
ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పరిధిలో జరిగిన అవినీతిపై విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది. అరెస్టు తర్వాత, రఘువంశీని రాజధాని ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు. బెయిల్ విచారణ సందర్భంగా నిందితుల తరపున న్యాయవాది సిద్ధాంత్ మొహంతి హాజరయ్యారు.
“బెయిల్ విచారణ జరిగింది. అనంతరం పీసీ చట్టం (అవినీతి నిరోధక చట్టం) సెక్షన్ 7 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఈ కేసును జూన్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మొహంతి తెలిపారు. దర్యాప్తు కొనసాగాల్సి ఉంది.”