గౌహతి: రెండేళ్ల క్రితం జాతి ఘర్షణతో అట్టుడికిన మణిపూర్ గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిగురుటాకులా వణుకుతోంది. రాష్ట్రంలోని నదులు పొంగి ప్రవహించడం, కరకట్టలు తెగిపోవడం వల్ల 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయని, 19,811 మంది ప్రజలు ప్రభావితమయ్యారని వారు తెలిపారు.
మణిపూర్లో మైతీ-కుకీ సంఘర్షణను పరిష్కరించడానికి మోహరించిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్ మైతీ ఆధిపత్యం కలిగిన ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలు తీవ్రమైన వరదలో చిక్కుకున్న 1,000 మందికి పైగా బాధితులను రక్షించారు. ఇప్పటిదాకా మణిపూర్లో వరదల బారిన పడిన 1,000 మందికి పైగా ప్రజలను సైన్యం రక్షించింది; అస్సాంలో ఇప్పటికీ 5 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
సోమవారం సాయంత్రం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వరద బులెటిన్ ప్రకారం… కనీసం 174 గ్రామాల్లో 56,000 మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు. వరద బాధితుడు ఒకరు కనిపించడం లేదని తెలిపింది. సంఘర్షణ కారణంగా సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారు కూడా వరద బాధితుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. కనీసం 93 చోట్ల కొండచరియలు విరిగిపడిన సంఘటనలు నమోదయ్యాయి కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
జాతి ఘర్షణ కారణంగా ముఖ్యమంత్రి పదవికి ఎన్. బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుండి మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
కాగా, మరో ఈశాన్య రాష్ట్రంలో అస్సాంలో వరద పరిస్థితి దారుణంగా మారింది, 22 జిల్లాల్లో బాధితుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. ఆదివారం ఈ సంఖ్య 3.64 లక్షలు. హోజై జిల్లాలో కొత్తగా ఒకరు మరణించినట్లు తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 11 కి చేరుకుంది.
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం ఉత్తర అస్సాంలోని లఖింపూర్ను సందర్శించారు, అక్కడ రంగనది నదిపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు నుండి నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NEEPCO) నీటిని విడుదల చేయడం వల్ల అనేక గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి, శనివారం NEEPCO అధికారులతో సమావేశం నిర్వహించిన శర్మ, ఆ ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసిన తీరును ప్రశ్నించారు. తరువాత ఏవైనా లోపాలు ఉంటే గుర్తించడానికి విచారణ చేపడతామని చెప్పారు.
సోమవారం సాయంత్రం అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన రోజువారీ వరద బులెటిన్ ప్రకారం 17 జిల్లాల్లో 3,64 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ప్రభావితులయ్యారు. కాగా, అస్సాం, మేఘాలయ ముఖ్యమంత్రులు సోమవారం గౌహతిలో సమావేశమై వరదలను తగ్గించే మార్గాల గురించి చర్చించారు. మే 30 నుండి ఈశాన్యంలో కురుస్తున్న భారీ వర్షాల ఫలితంగా వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి, దీని ఫలితంగా కనీసం 32 మంది మరణించారు.
మణిపూర్
ప్రభావితమైన వ్యక్తులు: 56,516
తప్పిపోయినవారు: 01
దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య: 10,477
సహాయక శిబిరాల సంఖ్య: 57
పంటల విస్తీర్ణం: 64.31 హెక్టార్లు
అస్సాం:
ప్రభావితమైన ప్రజలు: 5.15 లక్షలు
వరదలు కారణంగా మరణాలు: 11
సహాయక శిబిరాల సంఖ్య: 322
పంట నష్టం : 12,610 హెక్టార్లలో పంట దెబ్బతింది