న్యూఢిల్లీ : పెద్దల సమ్మతితో జరిగే మతాంతర వివాహాల్లో రాష్ట్రాలు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. ఈమేరకు ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ కింద బుక్ అయిన వ్యక్తికి అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆ వ్యక్తి మతాంతర వివాహంపై రాష్ట్రం ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కొన్ని మితవాద అనుబంధ సంస్థలు, వ్యక్తులు వారి కలయికను వ్యతిరేకించిన తర్వాత అతనిపై పోలీసు ఫిర్యాదు దాఖలైంది.
వారి కుటుంబాల అనుమతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఒక రోజు తర్వాత …. తన భార్యను మతం మార్చమని బలవంతం చేయనని, ఆమె తన విశ్వాసాన్ని అనుసరించడానికి స్వేచ్ఛగా ఉందని ధృవీకరిస్తూ. ముస్లిం వ్యక్తి అఫిడవిట్ కూడా సమర్పించాడు,
ముస్లిం వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ, న్యాయమూర్తులు BV నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఇలా పేర్కొంది…“ప్రతివాది-రాష్ట్రం అప్పీలుదారు, అతని భార్య వారి తల్లిదండ్రులు, కుటుంబాల కోరిక మేరకు వివాహం చేసుకున్నందున వారు కలిసి నివసించడం పట్ల ఎటువంటి అభ్యంతరం చెప్పకూడదని వారు పేర్కొన్నారు.
మొత్తంగా విభిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ జోక్యం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది.