టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి గ్రాండ్ అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ‘ఫత్వా’ జారీ చేశారు. వారిని “దేవుని శత్రువులు” అని అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న కారణంగా అమెరికన్, ఇజ్రాయెల్ నాయకులను ఓడించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు.
ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా ‘యుద్ధనేత’ లేదా ‘మొహరేబ్’గా పరిగణిస్తారని” మకరెంజీ తన ఫత్వాలో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్‌గా గుర్తించిన వ్యక్తికి… వారు ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా దేశ బహిష్కరణ విధిస్తారని ఫాక్స్ న్యూస్ నివేదిక తెలిపింది.
“ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు ఆ శత్రువుకు చేసే ఏదైనా సహకారం లేదా మద్దతు హరామ్ లేదా నిషిద్ధం” అని ఫత్వాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ శత్రువులు చేసినతప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరం” అని ఫత్వాలో పేర్కొన్నారు.
” విశ్వాసి అయిన ఒక ముస్లిం తన మార్గంలో కష్టనష్టాలను ఎదుర్కొంటే…ఒక వేళ దేవుడు కోరుకుంటే, అతనిని దైవ మార్గంలో పోరాట యోధులుగా ప్రతిఫలం పొందుతారని” కూడా అది పేర్కొంది.
జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబు దాడిని ప్రారంభించి, దాని అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న అగ్ర సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలను చంపడంతో పాటు ఇరాన్‌తో 12 రోజుల యుద్ధం చేసిన తర్వాత ఈ ఫత్వా జారీ అయింది. ఇజ్రాయెల్ నగరాలపై బాలిస్టిక్ క్షిపణి దాడులతో టెహ్రాన్ దీటుగా ప్రతిస్పందించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పేర్కొంది — ఈ ఆశయాన్ని టెహ్రాన్ నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది.
ఇరాన్ మూడు అణు కేంద్రాలపై దాడి చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ దళాలతో చేరిన తర్వాత పోరాటం ముగిసింది. ఆ తర్వాత ఇరాన్ ఖతార్‌లోని ఒక అమెరికన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేసింది.
ఫత్వా అంటే ఏమిటి?
ఫత్వా అనేది 12వ శతాబ్దపు అత్యున్నత స్థాయి మత గురువు ఏదైనా ఒక అంశంపై జారీ చేసిన ఇస్లామిక్ చట్టం వివరణ. అధికారిక తీర్పు. ఇస్లామిక్ ప్రభుత్వాలు, వ్యక్తులతో సహా అందరు ముస్లింలు దాని అమలుకు పూనుకోవాలని ఇది పిలుపునిస్తుంది.
ఇరానియన్ మతాధికారులు ఒక వ్యక్తిపై హింసకు పిలుపునిస్తూ ఫత్వాను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు.
అత్యంత అపఖ్యాతి పాలైన ఫత్వా 1989లో రచయిత సల్మాన్ రష్దీపై జారీ అయింది. ఆయన నవల “ది సాటానిక్ వెర్సెస్” విడుదలైన తర్వాత, దీనిని చాలా మంది ముస్లింలు అభ్యంతరకరంగా భావించారు. ఫత్వాలో రష్దీని హత్య చేయాలని పిలుపునిచ్చింది, దీనితో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇది జపనీస్ అనువాదకుడి హత్యకు, పుస్తక ప్రచురణకర్తలపై అనేక దాడులకు దారితీసింది.
అప్పటి నుండి, రష్దీపై అనేక హత్యాయత్నాలు జరిగాయి, 2023లో అప్‌స్టేట్ న్యూయార్క్‌లో జరిగిన కత్తిపోటులో ఆయన కన్ను కోల్పోయారు.