చెన్నై: విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన నలుగురు దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు సమర్పించిన పిటిషన్‌ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
తనతో పాటు తన ముగ్గురు సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదేపదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. “మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో మానవ మలాన్ని శుభ్రం చేయమని బలవంతం చేశారని కార్మికులు ఆరోపించారు.
కాగా, కార్మికులు వీరిపై పిర్యాదు చేయగా… స్థానిక పోలీసు అధికారులు ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కార్మికులను బలవంతం చేస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ఖాళీ కాగితాలపై సంతకం చేయమన్నారని కూడా కార్మికులు చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా పంచాయతీ అధ్యక్షుడి నుండి వివక్ష, సూటిపోటి మాటలు, శారీరక బెదిరింపులు భరించలేనివిగా మారాయని కార్మికులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై మేనెలలో ఫిర్యాదు దాఖలయింది. కార్మికులు చెప్పినట్లుగా, మేము ఫిర్యాదును ఉపసంహరించుకున్నామని చెప్పుకోవడానికి తరువాత తయారు చేసిన ఖాళీ కాగితాలపై సంతకం చేయమని కూడా వారు మమ్మల్ని బలవంతం చేశారు.” ఉపాధ్యక్షుడు సెల్వం, పారిశుధ్య పర్యవేక్షకులు కవితతో సహా పంచాయతీ అధికారులకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని కార్మికులు ఫిర్యాదులో తెలిపారు.
కేసును ఉపసంహరించుకున్నట్లు చూపించడానికి అధికారులు తమను బలవంతంగా నకిలీ పత్రాలపై సంతకం చేయించారు. కార్మికులలో ఒకరిపై దాడి చేసిన నిందితులలో ఒకరైన మానివ్‌కు పోలీసులు మద్దతు ఇచ్చి సహాయం చేశారని కూడా వారు ఆరోపించారు.
మే 25న వారు వలవనూర్ పోలీస్ స్టేషన్‌లో మణివేల్‌పై ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు, రెవెన్యూ అధికారుల నిజనిర్ధారణ బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. కానీ అధికారిక వర్గాలు పారిశుధ్య కార్మికులను తరువాత దళిత ప్రాంతాలకు బదిలీ చేశారని, వారు హిందూ ప్రాంతాలలో పనిచేయకుండా నిషేధించారని నిర్ధారించాయి. “మేము అక్కడ పనిచేయడం మానేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు మాకు చెప్పారు” అని పారిశుద్ధ్య కార్మికురాలు అతిలక్ష్మి అన్నారు.
మొత్తంగా మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు మణివేల్ పై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద చర్యలు తీసుకోవాలని, పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై చర్య తీసుకుని, డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) విల్లుపురం ఎస్పీకి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.