వాషింగ్టన్: “బ్రిక్స్ యొక్క అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే” దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో చిక్కుకున్న బ్రిక్స్ నేతలు “సుంకాలలో విచక్షణారహిత పెరుగుదల” గురించి తమ “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేసిన తర్వాత ఆయన ఈ విషయం చెప్పారు.
‘‘బ్రిక్స్ కానీ మరే సంస్థ కానీ అమెరికన్ వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశానికైనా అదనంగా పది శాతం సుంకంవిధిస్తాము. ఈ విధానానికి ఎటువంటి మినహయింపులు ఉండవు’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అయితే అమెరికా వ్యతిరేక విధానాలు అంటే ఏమిటో అమెరికా అధ్యక్షుడు పేర్కొనలేదు.
తదుపరి సందేశంలో, ట్రంప్ కొత్త సుంకాల విధానాన్ని వివరించే అధికారిక డాక్యుమెంటేషన్ సోమవారం మధ్యాహ్నం నుండి సంబంధిత దేశాలకు పంపుతామని ప్రకటించారు:
ఈ ప్రకటన బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ట్రంప్ నుంచి టారిఫ్‌ల ప్రకటన వెలువడటం గమనార్హం. కాగా, బ్రిక్స్ నేతలు అమెరికా ఏకపక్షంగా టారిఫ్‌లు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు WTO నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని అమెరికాను హెచ్చరించారు.
బ్రిక్స్ కూటమిలో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా,ఇరాన్ ఉన్నాయి.