న్యూఢిల్లీ: నేడు భారత్ బంద్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నేడు బంద్ పాటిస్తున్నాయి. ‘భారత్ బంద్’ వల్ల బ్యాంకింగ్ రంగం సహా, పరిశ్రమలు, పోస్టల్, ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండనుంది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను కేంద్రం ముందుంచి ఏడాది పూర్తయినా కేంద్రం స్పందించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. అయితే, పాఠశాలలు ఇతర విద్యా సంస్థలు ప్రత్యక్షంగా ప్రభావితం కాకపోవచ్చు. ఈ సమ్మెలో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటున్నారని భారతదేశంలోని 10 కేంద్ర కార్మిక సంఘాల ఫోరమ్ తెలిపింది.
బ్యాంకులు పనిచేస్తాయా?
జూలై 9న బ్యాంకులకు అధికారిక సెలవు ప్రకటించనప్పటికీ, ఈ రంగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొనడం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే, ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు సాధారణ డిమాండ్లపై భారత్ బంద్‌లో చేరతారని బ్యాంకు ఉద్యోగుల సంఘం చెప్పినట్లు PTI నివేదిక పేర్కొంది. సిబ్బంది నిరసన తెలిపే అవకాశం ఉన్నందున, సాంకేతికంగా బ్యాంకులు తెరిచి ఉన్నప్పటికీ, వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA)కి అనుబంధంగా ఉన్న బెంగాల్ ప్రావిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బీమా రంగం కూడా సమ్మెలో పాల్గొంటుందని పేర్కొంది.
పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తారా?
భారత్ బంద్ పిలుపు కారణంగా పాఠశాలలు, కళాశాలలతో సహా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించలేదు. స్కూళ్లు మూసివేయాలని అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదు. బుధవారం విద్యా సంస్థలు యధావిధిగా పనిచేస్తాయని భావిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో స్థానిక అధికారులు లేదా వ్యక్తిగత యాజమాన్యాలు సూచనల మేరకు పాఠశాలలు, కళాశాలలు మూసి వేస్తున్నారు. అయితే, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయకపోవడం లేదా ధర్నా నిర్వహించడం వంటి సందర్భాలు ఉండవచ్చు.
ప్రైవేట్ ఆఫీసులు పని చేసినా రవాణా సమస్యల కారణంగా హాజరు తగ్గవచ్చు. ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు అనేక నగరాలలో నిరసనలు, రాస్తారోకోల కారణంగా అవాంతరాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైల్వే కార్మిక సంఘాలు సమ్మె ప్రకటన చేయనప్పటికీ రైల్వే ట్రాకులు, స్టేషన్ల వద్ద నిరసనల కారణంగా రైలు సర్వీసులు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది.
అటు విద్యుత్ రంగ అధికారులు సుమారు 27 లక్షల మంది ఈ బంద్‌లో పాల్గొంటున్నారు. దీని ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఉండే అవకాశం లేకపోలేదు. అలాగే రైల్వేస్ విషయంలోనూ.. భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే సమ్మె గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ట్రైన్స్ కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది. కార్మికుల నిరసనల కారణంగా ప్రయాణికులు రైలు సర్వీసుల్లో అంతరాయాలు సంభవించవచ్చు. జూలై 9న మీరు ప్రయాణిస్తుంటే రైలు సమయాలను తనిఖీ చేయడం క్రాస్-చెక్ చేయడం ఉత్తమం.