పాట్నా: కిషన్‌గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాలతో కూడిన బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. అయితే జూన్ 24న భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాంతం…రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల దాడికి గురైంది.
ఇంతకుముందు, ఎటువంటి ఆధారం లేకుండా ‘అక్రమ విదేశీ వలసదారులు’ ఉన్నట్లు ఆరోపిస్తూ ఈ ప్రాంతం పరువు తీశారు. ఈ జిల్లాల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు ఉన్నారని ఆరోపించింది BJP నాయకులే కాదు; ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు.
ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ఆధార్ కార్డులను కూడా సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ECIని ఆదేశించినప్పుడు ఈ ప్రాంతం …మళ్ళీ గోడి మీడియా. BJP నాయకుల లక్ష్యంగా మారింది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితా SIR కోసం ECI గతంలో కోరిన 11 పత్రాలలో ఆధార్ కార్డు చేర్చలేదు.
నాలుగు జిల్లాల్లో ఆధార్ కార్డుల సంఖ్య వారి జనాభా కంటే ఎక్కువగా ఉందని మీడియా అతిగా చెప్పిందని, తద్వారా ‘అక్రమ విదేశీయులు’ బంగ్లాదేశ్ నుండి చొరబడి ఈ జిల్లాలను తమ నివాసంగా మార్చుకున్నారనే ఆరోపణలను నిరూపించడానికి ప్రయత్నించింది. ఆశ్చర్యకరంగా, ECI కూడా తన అధికారిక ప్రకటనలో ఈ ఆరోపణలను చేర్చింది. దీంతో బీజేపీ, దాని మాతృ సంస్థ RSS రాజకీయ ఎజెండాను ఈసీ గుడ్డిగా అనుకరిస్తున్నారని విపక్షనేతలు ఆరోపించారు.
ఉన్న జనాభా కన్న ఆధార్ ‘కార్డుల సంఖ్య ఎక్కువ’, ‘అక్రమ వలస’ కథనాలు ఈ ప్రాంతంపై మీడియా పరిశీలనను తీవ్రతరం చేశాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల ఓటు హక్కును కోల్పోవడం, రాజకీయ అవకతవకలు జరుగుతాయనే భయాలను పెంచాయి. నకిలీలు, మరణించిన లేదా అనర్హులైన ఓటర్లను, ‘అక్రమ విదేశీ వలసదారులను’ తొలగించడం ద్వారా బీహార్ ఓటరు జాబితాను నవీకరించడానికి SIR ప్రారంభించామని ECI పేర్కొంది.
బంగ్లాదేశ్ లేదా రోహింగ్యా వలసదారులకు సంబంధించిన “ఆధార్ కార్డ్ స్కామ్”ను ఆరోపించడానికి బిజెపి నాయకులు, గోడి మీడియా కూడా ఆధార్ ‘ఓవర్‌సాచురేషన్’ను ఉదహరించాయి. ఆధార్‌ను ఓవర్‌సాచురేషన్ చేయడం అనే ‘నకిలీ కథనం’ దానిని SIRలో చేర్చకుండా ఉండటానికి ఒక ఆధారాన్ని సిద్ధం చేయడమేనని కథనం వినిపిస్తోంది.
సీమాంచల్ ప్రాంతంలో అక్రమ విదేశీ వలసదారులు తమ జనాభా కంటే ఎక్కువ ఆధార్ కార్డుల సంఖ్యను కలిగి ఉన్నారని బిజెపి, గోడి మీడియా సమర్థించడానికి ప్రయత్నిస్తాయి. అయితే, రాజకీయ నాయకులు, మీడియా, ECI కూడా విస్మరించిన విషయం ఏమిటంటే వారు 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆధార్ కార్డ్ గణాంకాలను పోల్చుతున్నారు. 2011లో జనాభా నేటి కంటే తక్కువగా ఉన్నందున, ఇప్పుడు జారీ చేసిన ఆధార్ కార్డుల సంఖ్య ఖచ్చితంగా జనాభాను మించిపోతుంది ఎందుకంటే గత 14 సంవత్సరాలలో జనాభా పెరిగింది. 2011 తర్వాత ఎటువంటి జన గణన నిర్వహించనందున వీటిని అధికారిక జనాభా డేటాలో చేర్చలేదు. గత ఒకటిన్నర దశాబ్దాలలో జనాభా పెరుగుదలను ECI విస్మరించింది, ఇది ముస్లిం కేంద్రీకృత జిల్లాల్లో అక్రమ విదేశీ వలసల అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఓటర్లను ధ్రువీకరించాలని కోరుకునే బిజెపి నాయకుల భాషను ఉపయోగించడం ప్రారంభించింది.
కానీ ఆధార్ కార్డుల ‘ఓవర్ సాచురేషన్’ ఈ ముస్లిం కేంద్రీకృత జిల్లాల్లో మాత్రమే కాదు. జెహానాబాద్ మినహా, అతితక్కువ ముస్లిం జనాభా ఉన్న బీహార్‌లోని అన్ని ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది, ఇక్కడ అది 97% మాత్రమే. కానీ మీడియా, బిజెపి ఈ జిల్లాల్లో కూడా ఈ సమస్యను ఎందుకు హైలైట్ చేయడం లేదు? అక్రమ విదేశీయులను గుర్తించడానికి ఆధార్ కార్డుల ‘ఓవర్ సాచురేషన్’ ప్రమాణం అయితే, సీమాంచల్ ప్రాంతం వెలుపల బీహార్‌లో కూడా అక్రమ విదేశీయులు ఉన్నారు. ఇతర జిల్లాల్లో ఆధార్ కార్డుల ‘ఓవర్‌సాచురేషన్’పై బిజెపి, బిజెపి అనుకూల మీడియా ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇది బిజెపి వైపు సీమాంచల్ పట్ల పక్షపాతం, గోడి మీడియా వైపు వృత్తి నైపుణ్యం లేకపోవడాన్ని సూచిస్తుంది.
UIDAI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, జెహానాబాద్ జిల్లా (97%) మినహా, బీహార్‌లోని అన్ని ఇతర జిల్లాలు 100% కంటే ఎక్కువ ఆధార్ సంతృప్తతను కలిగి ఉన్నాయి. క్రింద ఇచ్చిన పట్టికలో ఆధార్ కార్డ్ ఓవర్‌సాచురేషన్‌ను చూడవచ్చు.
District | Saturation | District | Saturation |
Patna | 113 | Gopalganj | 115 |
East Champaran | 110 | Bhojpur | 102 |
Muzaffarpur | 110 | Supaul | 107 |
Samastipur | 113 | Aurangabad | 102 |
Madhubani | 106 | Nawada | 103 |
Gaya | 103 | Banka | 111 |
Darbhanga | 112 | Madhepura | 113 |
West Champaran | 112 | Saharsa | 114 |
Saran | 107 | Kishanganj | 126 |
Purnia | 121 | Jamui | 109 |
Vaishali | 108 | Khagaria | 113 |
Katihar | 123 | Buxar | 107 |
Sitamarhi | 110 | Kaimur(Bhabua) | 108 |
Siwan | 109 | Munger | 105 |
Araria | 123 | Lakhisari | 110 |
Begusarai | 115 | Jehanabad | 97 |
Bhagalpur | 111 | Sheikhpura | 118 |
Nalanda | 108 | Sheohar | 112 |
Rohtas | 103 | Arwal | 103 |
సీమాంచల్‌లో ముస్లింలు 38% నుండి 68% వరకు ఉన్నారన్న ఈ దుష్ప్రచారం అక్కడ విస్తృత ఆందోళనకు దారితీసింది. బీహార్‌లోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా కిషన్‌గంజ్. దీనిని బిజెపి నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి లక్ష్యంగా చేసుకున్నారు. జూలై మొదటి వారంలో, నివాస ధృవీకరణ పత్రం కోసం రెండు లక్షలకు పైగా దరఖాస్తులు సమర్పించారని ఆయన పేర్కొన్నారు. నివాస ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ‘పెరుగుదల’పై అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారు కోరినట్లు ఆయన తెలిపారు.
సామ్రాట్ చౌదరి అసలు విషయాలను గాలికొదిలేసి, సీమాంచల్ వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని AIMIM రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అఖ్తరల్ ఇమాన్ అన్నారు. బీహార్‌లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం సహజం. జనన, నివాస, క్యారెక్టర్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించిన సందర్భాలు కనీసం రెండు ఉన్నాయని అఖత్రుల్ ఇమాన్ అన్నారు. “అడ్మిషన్ సీజన్, ఉద్యోగ ప్రకటనలు వచ్చినప్పుడు, ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి, సామ్రాట్ చౌదరి ప్రజలను తప్పుదారి పట్టించడం మానేయాలి” అని AIMIM నుండి ఎమ్మెల్యే సూచించారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణ పాక్షికంగా సహాయం అందించడంతో, పెరుగుతున్న రాజకీయ, సామాజిక ఉద్రిక్తతల మధ్య సీమాంచల్ నివాసితులు తమ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోగలరా అన్నది రాబోయే నెలలు జవాబు చెబుతాయి. .
రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ వంటి ప్రతిపక్ష నాయకులు SIRని బ్యాక్‌డోర్ ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)’గా ఆరోపించారు. NDA వ్యతిరేక ఓట్లను అణిచివేసేందుకు ప్రతిపక్షాల బలమైన కోట అయిన సీమాంచల్‌ను ఇది అసమానంగా లక్ష్యంగా చేసుకుంటుందని వారు వాదిస్తున్నారు. బీహార్ అంతటా రెండు కోట్ల మంది ఓటర్లు ప్రభావితమవుతారని అంచనాలు సూచిస్తున్నాయి. మొత్తంగా జనాభా, భౌగోళిక ప్రొఫైల్ కారణంగా సీమాంచల్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.