న్యూఢిల్లీ: ఇటీవల ఖురైష్ సోదరుల అఖిల భారత ప్లీనరీ ఘజియాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో వివాహాల్లో దుబారా ఖర్చును తగ్గించాలని, అదే డబ్బును విద్యపై ఖర్చు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యా సంస్థలతో పాటు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల వంటి వృత్తిపరమైన కోర్సులను అందించే ఇనిస్టిట్యూట్‌లను కూడా స్థాపించాలని వారు నిర్ణయించారు.
ఈ సమావేశానికి ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 16న సికింద్రాబాద్‌లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా జమియతుల్ ఖురైష్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ ఖైర్షి అధ్యక్షత వహించారు. వివాహాలలో పరిమిత వంటకాలు వడ్డించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు నోయిడా జిల్లా జమియతుల్ ఖురైష్ అధ్యక్షుడు షాహిద్ ఖురైషీ చెప్పారు.

కేవలం ప్రదర్శన కోసం విలాసవంతంగా ఖర్చు చేసేవారు వాస్తవానికి సమాజంలోని పేదలపై చాలా ఆర్థిక భారాన్ని మోపుతారు. సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించడానికి ఈ చర్య తీసుకున్నాం. జమియతుల్ ఖురైష్ ఇచ్చిన సలహాలను పాటించని వివాహాలకు హాజరుకావద్దని షాహిద్ ఖురైషి ఓ తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. ఆడంబరంగా జరిగే వివాహాలకు జమియతుల్ ఖురైష్ సభ్యులతో కలిసి హాజరు కావద్దని ఆయన కోరారు. అనుకోకుండా అలాంటి వివాహాలకు హాజరైనప్పటికీ, జమియతుల్ ఖురైష్ సభ్యులంతా అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆయన నిష్కర్షగా చెప్పారు.
ఖరైష్ సోదరుల వీడియో లింక్
https://muslimmirror.com/wp-content/uploads/2025/07/VID-20250720-WA0316.mp4?_=1
ప్రవక్త ముహమ్మద్ (స) ఎల్లప్పుడూ తక్కువ ఖర్చుతో కూడిన సాధారణ వివాహాల (నికాహ్ వేడుక) కోసం ప్రబోధించారు. ముస్లింలు తమ ప్రవక్త (స) సలహాను అనుసరించడానికి బదులుగా ముస్లిమేతరుల పద్ధతులను అనుకరించారు. సాధారణ నికాహ్ వేడుకకు బదులుగా, వారు “మెహందీ”, “ఉబ్తాన్” వంటి అనవసరమైన కార్యక్రమాలను జోడించారు.
తమ సంపదను ప్రదర్శించడానికి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా వరకట్నం ఇచ్చారు. ఇటీవల యూపీలో జరిగిన వివాహంలో, ఒక పెద్దమనిషి ఒకే రోజు వివాహం చేసుకున్న తన ఇద్దరు కుమార్తెలకు ఫార్చ్యూనర్ కారు ఇచ్చాడు. అతను దీనితో సంతృప్తి చెందలేదు. ఇంటర్నెట్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా తన సంపదను ప్రదర్శించేలా ప్రవర్తించాడు. నా హిందూ స్నేహితుడిలో ఒకరికి అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి అతను నాతో మాట్లాడుతూ.. ప్రతి కుమార్తె వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వాపోయాడని ఖురైషీ అన్నారు.
ముస్లింలు తమ ప్రవక్త (స) ను అనుసరించడం ద్వారా మార్గాన్ని చూపించాల్సిందని, తద్వారా మనకు వివాహం సులభతరం చేసారని అతను అభిప్రాయపడ్డారు. కానీ మనలోని ధనికవర్గం షైతాను మార్గాలను అవలంబిస్తున్నారని ఆయన వాపోయారు.
ముస్లిం సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలను ఆపడానికి, ఉలామాలు (పండితులు) ముందుకు రావాలి. వివాహాలు ఖాజీలచే నిర్వహిస్తారు. అసలు ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం జరగని వివాహాలకు వారు హాజరు కాకూడదని నిర్ణయించుకోవాలి. అలాంటి వివాహాలను జరపడానికి నిరాకరించాలి. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగడం లేదని తెలిసిన వివాహాలకు మౌలానాలు హాజరుకాకూడదని ఖరైషీ పండితుడు అభిప్రాయపడ్డారు.
కాగా జమియతుల్ ఖురైష్ సమావేశంలో ఆమోదించబడిన తీర్మానాన్ని అందరు ముస్లింలు గమనించాలి. దానిని అనుసరించడం ద్వారా వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. ఇది ముస్లిం సమాజంలో ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. ముస్లిం బాలురు, బాలికలు వారి విద్యను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించగలుగుతారు.