న్యూయార్క్ : గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల సంఘాలు న్యూయార్క్ నగరంలో సమావేశమయ్యాయి.
https://www.instagram.com/reel/DMcZbL5uFq-/?igsh=MTl3Y2FvNjBuazgzNA==
“ గాజా ఆకలి బాధనుండి విముక్తం చేయండి!”, “గాజా పిల్లలకు ఆహారం ఇవ్వండి”, “సరిహద్దును తెరవండి, దిగ్బంధనను ముగించండి” అని రాసిన ప్లకార్డులను వారు ప్రదర్శించారు.
గాజాలో సామూహిక ఆకలి భరించలేని స్థాయికి చేరినందున గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ముట్టడిని తక్షణమే ముగించాలని డిమాండ్ చేస్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోతో సహా ఇతర నగరాల్లో కూడా నిరసనలు జరిగాయి.
పౌరులను లక్ష్యంగా చేసుకోబోమని ఇజ్రాయెల్ పదేపదే హామీ ఇచ్చినప్పటికీ, గాజాలో సాయం కోసం వస్తున్న వారిపై జరుగుతున్న దాడులనుఐక్యరాజ్యసమితి ఖండించింది.
2023 అక్టోబర్ నుండి ఇప్పటిదాకా గాజాలో 59,100 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ చంపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు కావడం గమనార్హం. ఇజ్రాయెల్ దాడులు ఆ ప్రాంతాన్ని నాశనం చేసాయి, ఆరోగ్య వ్యవస్థను కూల్చివేసింది. తీవ్రమైన ఆహార కొరతకు దారితీసింది.
గత నవంబర్‌లో, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై యుద్ధ నేరాలు, గాజాలో మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ఇజ్రాయెల్ కూడా గాజా ఎన్‌క్లేవ్‌పై యుద్ధం చేసినందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణహోమం కేసును ఎదుర్కొంటోంది.