వాషింగ్టన్: భారతదేశంపై అదనపు జరిమానాలతో 25 శాతం సుంకాలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌లో అమెరికా “భారీ” చమురు నిల్వలను అభివృద్ధి చేస్తుందని ప్రకటించిన ట్రంప్, అవి ఏదో ఒక రోజు భారతదేశానికి విక్రయించవచ్చని చెప్పారు.
ఇప్పుడే పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్‌తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్ ఏదో ఒక రోజు భారత్‌కు చమురు విక్రయించవచ్చు. అనే దేశాలు సుంకాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద ఎత్తున తగ్గించడంలో సహాయపడతాయి’ అంటూ ట్రంప్ వెల్లడించారు.
ఈ భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో మేము ఉన్నాము. ఎవరికి తెలుసు, బహుశా వారు ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్ముతారేమో!” అని ఆయన అన్నారు. కాగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పాకిస్తాన్ నుండి తక్షణ స్పందన రాలేదు.
వాణిజ్య ఒప్పందాలపై వైట్ హౌస్ “చాలా బిజీగా” ఉందని, దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందంతో తాను సమావేశం అవుతానని ట్రంప్ అన్నారు. మేము ఈ రోజు వైట్ హౌస్‌లో వాణిజ్య ఒప్పందాలపై పని చేస్తూ చాలా బిజీగా ఉన్నాము. నేను అనేక దేశాల నాయకులతో మాట్లాడాను, వారందరూ యునైటెడ్ స్టేట్స్‌ను “చాలా సంతోషపెట్టాలని” కోరుకుంటున్నారు. నేను ఈ మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందంతో సమావేశమవుతాను. దక్షిణ కొరియా ప్రస్తుతం 25 శాతం సుంకాల జాబితాలో ఉంది. ఆ సుంకాలను తగ్గించుకునే ప్రతిపాద వారి వద్ద ఉంది. అది ఏంటో వినడానికి నేను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో రాసుకొచ్చారు.
కాగా, పాకిస్తాన్ ప్రస్తుతం తన ఇంధన డిమాండ్లను తీర్చడానికి మధ్యప్రాచ్యం నుండి చమురును దిగుమతి చేసుకుంటోంది, అయితే ఆ దేశంలో విస్తారమైన ఆఫ్‌షోర్ నిక్షేపాలు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. ఈ నిల్వలను ఉపయోగించుకోవడానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.
మరోవంక భారతదేశ వాణిజ్య విధానాలను “అత్యంత కఠినమైనవి, అసహ్యకరమైనవి” అని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో అభివర్ణించారు
ఆగస్టు 1 నుండి భారత దిగుమతులపై 25 శాతం సుంకం, అదనపు జరిమానాను ట్రంప్ ప్రకటించిన తర్వాత, వాషింగ్టన్ న్యూఢిల్లీతో వాణిజ్య లోటు, మనదేశం రష్యన్ చమురు కొనుగోలును ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ట్రంప్ తన పోస్ట్‌లో, అనేక దేశాల నాయకులతో వాణిజ్య ఒప్పందాలపై సంభాషణలు జరిపానని, “వీరందరూ యునైటెడ్ స్టేట్స్‌ను చాలా సంతోషపెట్టాలని కోరుకుంటున్నారు” అని పేర్కొన్నారు.