సిడ్నీ: గాజా ప్రజలకు సంఘీభావ ప్రదర్శనగా, ఆదివారం ఉదయం సిడ్నీలోని ఐకానిక్ హార్బర్ వంతెనపై లక్ష మంది మార్చ్ ఫర్ హ్యుమానిటీలో పాల్గొన్నారు. సేవ్ గాజా’ అనే నినాదంతో వేలాది మంది ప్రజలు ‘సిడ్నీ హార్బర్ వంతెన’పై నిరసన తెలిపారు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, మానవతా సహాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ వారు కవాతు నిర్వహించారు. ఈ నిరసనతో వంతెన దాదాపు ఐదు గంటల పాటు మూసివేసారు.
పాలస్తీనా యాక్షన్ గ్రూప్ నిర్వహించిన ఈ నిరసన, సెంట్రల్ సిడ్నీలోని లాంగ్ పార్క్ వద్ద ప్రారంభమై, వంతెన మీదుగా ఉత్తరం వైపు బ్రాడ్‌ఫీల్డ్ పార్క్‌కు వెళ్లింది. ప్రదర్శనకారులు పాలస్తీనా జెండాలు, “సేవ్ గాజా” అని రాసి ఉన్న ప్లకార్డులు, గాజాను పట్టి పీడిస్తున్న విస్తృతమైన ఆకలిని సూచించేలా ఖాళీ కుండలు, పాన్లను మోసుకెళ్లారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దాదాపు 100,000 మంది జనసమూహం అక్కడికి చేరినట్లు అంచనా వేశారు, అయితే నిర్వాహకులు ఈ సంఖ్యను 300,000 కు దగ్గరగా ఉన్నట్లు తెలిపారు., ఇది ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద ప్రజా ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. 2023 వరల్డ్ ప్రైడ్ మార్చ్ తర్వాత హార్బర్ వంతెనను మూసివేయించిన మొదటి ప్రజా నిరసన కూడా ఇదే.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్, ఆస్ట్రేలియా మాజీ విదేశాంగ మంత్రి బాబ్ కార్ ఊరేగింపు ముందు భాగంలో కనిపించారు. పక్కపక్కనే నడుస్తూ, గాజాలో సంక్షోభాన్ని ఆపడానికి తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు పట్టుకున్నారు.
కాన్బెర్రా టైమ్స్ ప్రకారం… గాజాను ప్రభావితం చేస్తున్న కరువుపై, ముఖ్యంగా పిల్లలలో జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రపంచ నాయకులు జోక్యం చేసుకుని, పాలస్తీనియన్ల ప్రాణాలను రక్షించే సహాయాన్ని ఈ ప్రాంతంలోకి అనుమతించమని ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.
ఈ ఏడాది మార్చి 2నుండి గాజాలోకి ఎంటర్ అయ్యే అన్ని సరిహద్దు క్రాసింగ్లను ఇజ్రాయెల్ మూసివేసింది. ఆహారం, వైద్య సహాయంతో సహా మానవతా సామాగ్రి రాకుండా అడ్డుకుంది. దీంతో గాజాలో పౌరుల పరిస్థితులను గణనీయంగా దిగజారింది, సహాయ బృందాలు ఎన్క్లేవ్ అంతటా తీవ్రమవుతున్న కరువు గురించి హెచ్చరించాయి.
2023 అక్టోబర్ నుండి కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక దాడి ఫలితంగా కనీసం 60,430 మంది పాలస్తీనియన్ మరణాలు సంభవించాయి. 148,700 మందికి పైగా గాయపడ్డారని గాజాలోని ఆరోగ్య అధికారులు నివేదించారు. యాక్సెస్ పరిమితుల కారణంగా అంతర్జాతీయ సహాయ ప్రయత్నాలు చాలావరకు అసమర్థంగా ఉండటంతో మానవతా సంక్షోభం పెరుగుతూనే ఉంది.
https://www.instagram.com/reel/DM4tCffo5Iw/?utm_source=ig_web_button_share_sheet