బెంగళూరు: గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించిన పత్రాలను ఈసీకి సమర్పించాలంటూ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు.
పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్నారు…ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని…. నోటీసుల్లో కర్ణాటక CEO తెలిపారు. రెండుసార్లు ఓటుకు సంబంధించి…రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీచేయలేదని నోటీసుల్లో CEO వివరించారు. ఫలితంగా… ఆరోపణలకు సంబంధించిన పత్రాలను తమకు పంపాలని కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి…. రాహుల్ గాంధీని కోరారు. ఆ పత్రాలను సమర్పిస్తే… పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
మరోవంక లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి కర్ణాటక సీఈఓ నోటీసు జారీ చేసిన వెంటనే, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలలో ఓట్ల దొంగతనం ఆరోపణలను నిరూపించడానికి ఒక డిక్లరేషన్‌పై సంతకం చేయాలని లేదా “అసంబద్ధ” ఆరోపణలు చేసినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ మరోసారి రాహుల్ గాంధీని కోరింది.