న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం “ఆక్రమణలను” తొలగించడానికి వరుస తొలగింపులు చేపడతామని ప్రతిజ్ఞ చేస్తుండటంతో, రాజకీయ సామాజిక నిపుణులు ఈ చర్యను విమర్శించారు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్ మార్చడమే’ దీని లక్ష్యం అని అన్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై తమ ‘ఆందోళన’ వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల దాడి నుండి వారిని రక్షించడానికి వివిధ వర్గాల ప్రజలను అంతర్-రాష్ట్ర సరిహద్దుల బఫర్ జోన్లలోకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతాలు ఇప్పటికే అస్సాం భూమిని ఆక్రమించుకున్నాయని పిటిఐ నివేదించింది.
ఈ ఏడాది జూన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం కనీసం తొమ్మిది సార్లు ప్రధాన తొలగింపు కార్యక్రమాలు నిర్వహించింది, ఇది అనేక వేల మంది ప్రజలను ప్రభావితం చేసింది. “ఇటీవల జరిగిన తొలగింపుల ఎజెండా ఆక్రమణలను తొలగించడం కాదు, ఎగువ అస్సాంలో ఒక భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యం అన్న సంగతి బహిరంగ రహస్యమే.
గౌరవ్ గొగోయ్ గత సంవత్సరం లోక్‌సభలో గెలిచి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియామకం తర్వాత, ఎగువ అస్సాం జిల్లాల్లో ‘గౌరవ్ అనుకూల పవనాలు’ ఉన్నాయని ప్రముఖ న్యూరో సర్జన్ నవనిల్ బారువా ఇక్కడ PTI కి చెప్పారు.
ఈ తొలగింపుల డ్రైవ్‌లతో అధికార బిజెపి హిందూ-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని స్థానిక సంస్థలు ఇప్పటికే ‘మియా వ్యతిరేక’ నిరసనలు నిర్వహించాయని ఆయన అన్నారు.
“మార్చి 2026 తర్వాత, అది ఆగిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ తర్వాత చాలా కాలం పాటు మియాస్ ఆక్రమణ గురించి మనం వినకపోవచ్చు” అని రాజకీయ వ్యాఖ్యాత కూడా అయిన బారువా అన్నారు.
‘మియా’ అనేది మొదట అస్సాంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ఉపయోగించే అవమానకరమైన పదం. బెంగాలీ మాట్లాడని ప్రజలు సాధారణంగా వారిని బంగ్లాదేశ్ వలసదారులుగా గుర్తిస్తారు.
ఇటీవల రెంగ్మా రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన భారీ తొలగింపు కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, హాండిక్ గర్ల్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (పొలిటికల్ సైన్స్) పల్లవి డేకా మాట్లాడుతూ… “సరైన పునరావాసం” లేకుండా ప్రజలను తొలగించడం వలన, ఇది అడవిని కాపాడటానికి ప్రభుత్వం చేసిన నివేదిక కంటే ఎక్కువ అని అన్నారు.
” ఆక్రమణదారుల నుండి ‘స్థానిక గిరిజనులను’ రక్షించడానికి అధికార పార్టీ చేసిన హడావుడి రాబోయే ఎన్నికలలో, మత విద్వేశానికి బీజం పడుతుందని ఆమె జోడించారు.
గత 10 రోజుల్లో, అస్సాం ప్రభుత్వం రెంగ్మా రిజర్వ్ ఫారెస్ట్, నంబోర్ సౌత్ రిజర్వ్ ఫారెస్ట్, గోలాఘాట్ జిల్లాలోని డోయాంగ్ రిజర్వ్ ఫారెస్ట్, లఖింపూర్‌లోని విలేజ్ మేత రిజర్వ్ నుండి 10,537 బిఘాస్ (1,400 హెక్టార్లకు పైగా) భూమి నుండి ఆక్రమణలను తొలగించింది.
ఈ నిర్బంధ చర్యలు దాదాపు 2,200 కుటుంబాలను నిర్వాసితులను చేశాయి, వీరిలో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడే ముస్లిం సమాజానికి చెందినవారు కావడం గమనార్హం.
ఇటీవలి తొలగింపులపై ప్రముఖ న్యాయవాది సంతను బోర్తాకుర్ ఇలా అన్నారు: “అది అటవీ భూమి అయితే, అక్కడ ఎవరు ఎక్కువ కాలం నివసిస్తున్నారో, అది వారికి శాశ్వతంగా స్థిరపడటానికి చట్టపరమైన హక్కులను ఇవ్వదు.
” అయితే, గోలాఘాట్‌లో ఇటీవలి కేసుల్లో చూసినట్లుగా, ఒకే ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం “పూర్తిగా వివక్షత” అని ఆయన అన్నారు. “ఇతర వర్గాల ప్రజలపై ఎటువంటి బహిష్కరణ జరగదని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్య రాజ్యాంగ విరుద్ధం. చట్టం దానిని అనుమతించదు” అని బోర్తాకుర్ అన్నారు.
రెంగ్మాలో 1,500 ముస్లిం కుటుంబాలు బహిష్కరించారు. మిగిలిన కుటుంబాలు బోడో, నేపాలీ, మణిపురి, ఇతర సమాజాలకు చెందినవి. వీరికి అటవీ హక్కుల కమిటీ (FRC) నుండి సర్టిఫికెట్లు ఉన్నాయి.
దిబ్రూఘర్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన కౌస్తుభ్ దేకా ప్రకారం… ఈ తొలగింపు కార్యక్రమం రాష్ట్రానికి ఒక ముఖ్యమైన,సున్నితమైన క్షణం. ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర సంక్లిష్ట సామాజిక-రాజకీయ చరిత్ర కీలకమైన పాత్రను హైలైట్ చేస్తుంది.
“ప్రభుత్వం మూడు అంశాల మధ్య న్యాయమైన సమతుల్యతను కొనసాగించాలి.
ఒకటి, నిజమైన భారతీయ పౌరులను ఎంపిక చేసి లక్ష్యంగా చేసుకుంటున్నారనే ఆరోపణను పూర్తి శ్రద్ధతో పరిష్కరించాలి.
రెండు, ‘అటవీ హక్కుల చట్టం’ వంటి ప్రగతిశీల పర్యావరణ చట్టాల కింద ప్రజలకు ఇచ్చిన హక్కులను గౌరవించాలి,” అని ఆయన అన్నారు.
అలాగే, కొనసాగుతున్న ప్రక్రియ… అస్సాం పొరుగు రాష్ట్రాలతో ఇప్పటికే అస్థిర సరిహద్దు వివాద దృష్టాంతంలో సమస్యలను రేకెత్తించకుండా జాగ్రత్త వహించాలని డెకా అన్నారు.
రెంగ్మాలోని అంతర్-రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో జరిగిన ఆక్రమణల గురించి న్యాయవాది బోర్తాకూర్ మాట్లాడుతూ… సాధారణంగా సరిహద్దు ప్రాంతాలలో, ప్రభుత్వం ప్రజలను బఫర్ జోన్లలో స్థిరపరుస్తుంది, తద్వారా వ్యతిరేక వైపు నుండి ఎటువంటి ఆక్రమణ జరగదు.
“అన్ని సరిహద్దు ప్రాంతాలలో మనం ఇలాంటి నివాసాలను చూడవచ్చు. సాధారణంగా మైనారిటీలు, గూర్ఖా, బిహారీ ప్రజలు, అలాంటి ప్రదేశాలలో స్థిరపడతారు” అని ఆయన జోడించారు.
బారువా కూడా తన వాదనను సమర్థించారు.పొరుగు రాష్ట్రాలతో ఉన్న అన్ని సరిహద్దు ప్రాంతాలలో, సాధారణంగా బయటి నుండి వచ్చిన ప్రజలు లేదా సంఘాలు స్థిరపడతాయని అన్నారు. “స్థానిక ప్రజలు సాధారణంగా అక్కడ నివసించరు.
ఆదివాసీలు, గూర్ఖాలు, మైనారిటీలు వంటి వర్గాల ప్రజలు అలాంటి ప్రాంతాలలో నివసిస్తున్నారు,” అని ఆయన జోడించారు. ఇటీవల బహిష్కరణలకు గురైన రిజర్వ్ అడవులు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో ఉన్నాయి, అక్కడ పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజలు భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తొలగింపుకు గురైన ప్రజలు తమ మునుపటి తరం 1978-79లో గోలాప్ బోర్బోరా ప్రభుత్వం, 1985లో అధికారంలోకి వచ్చిన AGP ప్రభుత్వం ద్వారా అడవిలో స్థిరపడ్డారని పేర్కొన్నారు.