32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రపంచ టాప్-3 కుబేరుడు… గౌతమ్ అదానీ! Gautam Adani

న్యూఢిల్లీ:  దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani) మళ్లీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకారు.  బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ డేటా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆయ‌న ఆస్తులు సుమారు 137 బిలియ‌న్ల డాల‌ర్లకు పైగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు.  ప్ర‌పంచంలో టాప్ ప్లేస్‌లో ఉన్న కుబేరుల్లో ఎల‌న్ మ‌స్క్‌, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ త‌ర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌత‌మ్ అదానీ నిలిచారు.

బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక ప్ర‌కారం.. ఆసియాకు చెందిన సంప‌న్నుల్లో తొలిసారి ఆ జాబితాలో చేరారు. భార‌త టైకూన్ ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన అలీబాబా గ్రూపు జాక్ మా సంప‌న్నుల జాబితాలో ఉన్నా.. వాళ్లెప్పుడు కూడా టాప్ త్రీ లోకి రాలేదు. ఈ సూచీలో ఆసియా నుంచి టాప్ 3లో చోటు దక్కించుకున్న తొలి వ్యక్తి అదానీనే కావడం విశేషం.

అదానీ గ్రూపు స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గౌత‌మ్ అదానీ. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆప‌రేట‌ర్‌. బొగ్గు వ్యాపారంలోనూ అదానీ గ్రూపు అగ్ర స్థానంలో ఉంది. 2021, మార్చి 31 నాటికి ఆ సంస్థ సుమారు 5.3 బిలియ‌న్ల డాల‌ర్ల రెవన్యూను ఆర్జించింది. ఎన్డీటీవీలో 29 శాతం వాటాను కొనుగోలు చేయ‌నున్న‌ట్లు అదానీ సంస్థ గ‌త వారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. డేటా సెంటర్ల నుండి సిమెంట్, మీడియా అల్యూమినా వరకు ప్రతిదానిలో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆదానీ గ్రూప్ భారతదేశంలోని విమానాశ్రయ ఆపరేటర్, సిటీ-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, బొగ్గు మైనర్‌ను కలిగి ఉంది.

గత నెలలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్‌ను సైతం దాటేసి, గౌతమ్ ఆదానీ (Gautam Adani) నాలుగో స్థానాన్ని చేరుకున్నారు. ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఆదానీ సంపదలో ఏకంగా 36 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. తొలుత ఏసియన్ రిచెస్ట్ పర్సన్ అయిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ని వెనక్కి తోసిన ఆదానీ, తర్వాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ను గత నెలలో అధిగమించారు. 91.9 బిలియన్ డాలర్ల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.

ఆదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన అమెరికా బిలియనీర్‌లలో కొందరిని అధిగమించగలిగారు. ఎందుకంటే వారు ఇటీవల వారి దాతృత్వాన్ని పెంచుకున్నారు. బిల్ గేట్స్ (Bill Gates) జూలైలో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు (Bill and Melinda Gates Foundation) 20 బిలియన్ డాలర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇటు వారెన్ బఫెట్ ఇప్పటికే 35 బిలియన్ డాలర్లకు పైగా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. దాతృత్వానికి వెచ్చించిన బిలియన్ల డాలర్లు బ్లూమ్‌బెర్గ్ సంపద ర్యాంకింగ్‌లో వారిని దిగువకు నెట్టాయి. గేట్స్ ఇప్పుడు ఐదవ స్థానంలో, బఫెట్ ఆరవ స్థానంలో ఉన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles