ఆమ్‌స్టర్‌డామ్: గాజాలో సైనిక దాడికి సంబంధించి ఇజ్రాయెల్‌పై అదనపు ఆంక్షలకు క్యాబినెట్ మద్దతు పొందడంలో విఫలమైన తర్వాత డచ్ విదేశాంగ మంత్రి కాస్పర్ వెల్డ్‌క్యాంప్ రాజీనామా చేశారు.
సెంటర్-రైట్ న్యూ సోషల్ కాంట్రాక్ట్ పార్టీ సభ్యుడు వెల్డ్‌క్యాంప్ మాట్లాడుతూ…”అర్థవంతమైన చర్యల”పై తాను ఒప్పందం కుదుర్చుకోలేకపోయానని, ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలపై సహచరుల నుండి పదేపదే ప్రతిఘటనను ఎదుర్కొన్నానని అన్నారు.
పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపించడంలో సెటిలర్స్ పాత్రను పేర్కొంటూ, ఇజ్రాయెల్ మంత్రులు బెజలెల్ స్మోట్రిచ్, ఇటామర్ బెన్-గ్విర్‌లపై తమదేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించే ప్రయత్నాలలో ఉంది.
గాజాలో “క్షీణిస్తున్న పరిస్థితుల” గురించి హెచ్చరించిన వెల్డ్‌క్యాంప్… నేవీ షిప్ భాగాల కోసం ఉద్దేశించిన మూడు ఎగుమతి అనుమతులను కూడా రద్దు చేశాడు. “గాజాలో ఏమి జరుగుతుందో…తూర్పు జెరూసలేంలో ఏమి జరుగుతుందో కూడా నేను గమనిస్తున్నాను” అని వెల్డ్‌క్యాంప్ విలేకరులతో అన్నారు.
ఓవైపు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కు భద్రతా హామీలను పరిగణలోకి తీసుకుంటోంది, మరోవైపు సుంకాలపై అమెరికాతో చర్చలు కొనసాగిస్తున్న వేళ… వెల్డ్‌క్యాంప్ నిష్క్రమణతో నెదర్లాండ్స్‌కు విదేశాంగ మంత్రి లేకుండా పోయారు. .
ఆయన రాజీనామా తర్వాత… ఒప్పంద మంత్రులు, రాష్ట్ర కార్యదర్శులు వెల్డ్‌క్యాంప్‌కు తమ మద్దతును ధృవీకరించారు. సంఘీభావంగా ఆపద్ధర్మ ప్రభుత్వానికి రాజీనామా చేశారు.
నెదర్లాండ్స్‌లో పరిణామాలపై బెర్లిన్ నుండి నివేదిస్తున్న అల్ జజీరాకు చెందిన స్టెప్ వాసెన్, వెల్డ్‌క్యాంప్ “పార్లమెంటులోని శాసనసభ్యుల నుండి, ముఖ్యంగా ఇజ్రాయెల్‌పై కఠినమైన ఆంక్షలను కోరుతున్న ప్రతిపక్షం నుండి ఒత్తిడి పెరుగుతోంది” అని అన్నారు.
కొన్ని వారాల క్రితం వెల్డ్‌క్యాంప్… ఇద్దరు ఇజ్రాయెల్ మంత్రుల ప్రయాణంపై నిషేధం విధించడం, గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులతో, డచ్ ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోందని వాసెన్ చెప్పారు.
“వెల్డ్‌క్యాంప్ కూడా ఇజ్రాయెల్‌తో EU కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఒత్తిడి చేస్తున్నారని” వాసెన్ జోడించారు, డచ్ విదేశాంగ మంత్రి “జర్మనీ దానిని అడ్డుకోవడం వల్ల మరింత నిరాశకు గురయ్యారు. కాబట్టి నెదర్లాండ్స్ ఇకపై ఎటువంటి యూరోపియన్ ఆంక్షల కోసం వేచి ఉండకూడదని, ఇజ్రాయెల్‌పై మాత్రమే ఆంక్షలు విధించాలని డచ్ పార్లమెంట్ నుండి ఒత్తిడి కూడా ఉంది” అని పేర్కొన్నారు.
యూరప్-ఇజ్రాయెల్ సంబంధాలు
ఇజ్రాయెల్‌పై పరిమితమైన డచ్ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ దేశం ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్ సరఫరాకు మద్దతు ఇస్తూనే ఉంది. పాలస్తీనియన్ యూత్ మూవ్‌మెంట్ పరిశోధన ప్రకారం…F-35 భాగాలను మోసుకెళ్ళే నౌకలు డానిష్ షిప్పింగ్ కంపెనీ మెర్స్క్ నిర్వహించే రోటర్‌డ్యామ్ నౌకాశ్రయంలో తరచుగా ఆగుతాయని తేలింది.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు F-35 జెట్‌లను ఉపయోగించింది, ఇవి స్ట్రిప్‌లో ఎక్కువ భాగాన్ని శిథిలావస్థకు చేర్చాయి. అక్టోబర్ 2023 నుండి 62,000 మందికి పైగా మరణాలకు కారణమయ్యాయి.
ఈ వారం ప్రారంభంలో, నెదర్లాండ్స్ 20 ఇతర దేశాలతో కలిసి ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో తన స్థావరాన్ని విస్తరించేందుకు ఆమోదం తెలపడాన్ని ఖండించింది. ఇది ఎంతమాత్రం “ఆమోదయోగ్యం కాదు, అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం” అని పేర్కొంది.
మరోవంక గాజాపై ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతున్నాయి, పెరుగుతున్న కరువు మధ్య గాజా నగరం నుండి దక్షిణం వైపుకు పౌరులు బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది. గాజా నగరం, పరిసర ప్రాంతాల నివాసితులు అధికారికంగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆకలి పర్యవేక్షణ సంస్థ ధృవీకరించింది.
కాగా, వెల్డ్‌క్యాంప్‌కు వారసుడిని ప్రకటించలేదు. జూన్ 3న మునుపటి సంకీర్ణం కూలిపోయినప్పటి నుండి పనిచేస్తున్న తాత్కాలిక డచ్ ప్రభుత్వం, అక్టోబర్‌లో ఎన్నికల తర్వాత కొత్త సంకీర్ణం ఏర్పడే వరకు ఉంటుందని భావిస్తున్నారు, ఈ ప్రక్రియకు నెలలు పట్టవచ్చు.