ముంబై: మహారాష్ట్రలో నాలుగు దశాబ్దాలుగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్ వినిపిస్తోంది. ఈ సారి ఎలాగైన తమ డిమాండ్ సాధించుకునేందుకు మరాఠా కోటా వీరుడు పట్టుబిగించాడు. గత రెండు సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహించిన మనోజ్ జరంగే-పాటిల్ శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. డిమాండ్ నెరవేరే వరకు తాను తిరిగి రానని ప్రకటించాడు.
ఏక్ మరాఠా, లాఖ్ మరాఠా’, ‘చలో ముంబై’, ‘మనోజ్ దాదా….ఆగే బడో, హమ్ తుమ్హారే సాథ్ హై’ అంటూ కాషాయ టోపీలు, కండువాలు ధరించిన వేలాది మంది మద్దతుదారుల గర్జన మధ్య జరంగే-పాటిల్ ఉదయం 10.00 గంటలకు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
అడపాదడపా కురుస్తున్న వర్షాలు ఆజాద్ మైదాన్‌లో మరాఠా నిరసనకారుల ఉత్సాహాన్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఆశ్రయం పొందిన అనేక మంది ఇతరుల ఉత్సాహాన్నిఏమాత్రం తగ్గించలేదు.
ఈ నిరసనలు వెంటనే పాలక మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మధ్య విమర్శలకు దారితీశాయి, వారు మరాఠాల డిమాండ్లను విస్మరించి, వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని ఒకరినొకరు నిందించుకున్నారు.
జల్నా జిల్లాలోని అంతర్వాలి సారథి గ్రామం నుండి ముంబైకి చేరుకున్న జరంగే-పాటిల్, ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించే ముందు, దిగ్గజ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, గణేష్ దీవెనలు కోరుతూ పూజలు నిర్వహించారు.
మరాఠా వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేటగిరీలో చేర్చాలని, కుంబీలుగా గుర్తించి 10% రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఉద్యమం డిమాండ్ చేస్తోంది. అయితే దీనిని రెండో వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. శనివారం నుండి నాగ్‌పూర్‌లో సమాంతర ఆందోళనను ప్రారంభిస్తామని బెదిరిస్తున్నారు.
ఈ సందర్భంగా మనోజ్ జరంగే మీడియాతో మాట్లాడుతూ… ‘నేను పక్కా ప్రణాళికతో ఇక్కడికి వచ్చాను. నా నిరాహార దీక్ష ప్రారంభమైంది. మా డిమాండ్లు నెరవేరే వరకు నేను ఇక్కడి నుంచి లేవను. బుల్లెట్లు కూడా నన్ను వెనక్కి లాగలేవు. విజయం సాధించి, ఆ వేడుకలో మా తలలపై గులాల్ పడకపోతే, ఆజాద్ మైదాన్ నుంచి మేం కదలబోం’ అని అన్నారు.
“నాకు ఒక కుటుంబం ఉంది… కానీ నేను మరాఠా సమాజాన్ని నా కుటుంబంగా చేసుకున్న కారణం కోసం… మమ్మల్ని సిగ్గుపడేలా చేసే ఏదీ మనం చేయకూడదు…ఆందోళన సమయంలో క్రమశిక్షణతో ఉండాలని, శాంతిని కాపాడాలని అనుచరులు, నిరసనకారులకు మనోజ్ పిలుపునిచ్చారు. ‘హింస, విధ్వంసం, రాళ్ల దాడి వంటివి చేయకూడదు. పోలీసులకు సహకరించండి. ఎవరూ మద్యం తాగకూడదు. ఎవరూ ఇబ్బంది కలిగించకూడదు. మొత్తం సమాజం మమ్మల్ని చూస్తోంది… మీ మనస్సులో విజయం మాత్రమే ఉండాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.”
Mumbai, Maharashtra: Maratha activist Manoj Jarange Patil says, "We must stay united and give our full strength. We had planned to hold the strike at Azad Maidan and we have reached here. Earlier, the government was not listening to us and not providing help, so we decided to… pic.twitter.com/0GczZpza3Q
— IANS (@ians_india) August 29, 2025