బార్సిలోనా: గాజాపై ఇజ్రాయిల్ దిగ్బంధనను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా అతిపెద్ద పడవ…గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిన్న బార్సిలోనా ఓడరేవు నుండి బయలుదేరింది. దీంతో పాటు మొత్తం 20 పడవలు మానవతా సాయం తీసుకొని ఆదివారం బార్సిలోనా నుండి గాజా స్ట్రిప్‌కు బయలుదేరాయి.
ఈ 20 నౌకల్లో 44 దేశాల నుండి 300 మందికి పైగా ప్రతినిధులు ఈ పడవల్లో గాజాకు పయనమయ్యారు. ఈ బృందం కరువును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు కీలకమైన మానవతా సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది.
ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి, గ్లోబల్ గాజా ఉద్యమం, స్టెడ్‌ఫాస్ట్‌నెస్ ఫ్లోటిల్లా, మలేషియాకు చెందిన సుముద్ నుసంతారా ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో ఈ మిషన్‌ను చేపట్టారు.
The Global Sumud Flotilla departs Barcelona carrying aid for Gaza, challenging a blockade that has deprived millions.
— Global Sumud Flotilla (@GlobalSumudF) August 31, 2025
When governments stay silent, the people rise. pic.twitter.com/ufDuxjLcW3
గట్టి భద్రతలో బయలుదేరిన ఈ నౌకాదళంలో వైద్య నిపుణులు, స్వతంత్ర జర్నలిస్టులు, సహాయ కార్మికులు, మానవ హక్కుల న్యాయవాదులను తీసుకువెళుతుంది. మరోవైపు ఇటలీ, ట్యునీషియా నుండి మరిన్ని నౌకలు కూడా వారితో పాటు గాజా స్ట్రిప్‌కు చేరుకుంటాయి. ఈ ప్రయత్నంలో సుమారు 70 పడవలు పాల్గొంటాయని ఫ్లోటిల్లా ప్రతినిధి సీఫ్ అబుకా షేక్ తెలిపారు.
ఈ మిషన్‌లో ఉన్న ప్రముఖ వ్యక్తులలో స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, ఐరిష్ నటి లియామ్ కన్నింగ్‌హామ్, స్పానిష్ నటుడు ఎడ్వర్డో ఫెర్నాండెజ్, బార్సిలోనా మాజీ మేయర్ అడా కోలావ్‌తో పాటు మానవ హక్కుల కార్యకర్త యాస్మిన్ అజార్, పర్యావరణవేత్త థియాగో అవిలా, న్యాయవాది మెలానీ స్కైస్సర్, శాస్త్రవేత్త కరెన్ మోయ్నిహాన్ సహా గ్లోబల్ సీ ఫ్లోటిల్లా పడవలో అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
JUST IN: Greta Thunberg before setting sail to Gaza:
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) August 31, 2025
Palestinians have been dehumanized to such an extent that they are only spoken of in terms of numbers and UN resolutions. pic.twitter.com/N6C9Ch0hoC
బయలుదేరే ముందు స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ మాట్లాడుతూ…గాజా మారణహోమాన్ని చూస్తోంది. ప్రజలు బాధలను వర్ణించలేము. గాజా జెనోసైడ్‌ను చూస్తూ మన ప్రభుత్వాలు మౌనంగా ఉండటం ఆక్షేపణీయం అని ఆమె అన్నారు. గాజాలో మానవతా అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి, ఇజ్రాయెల్ ముట్టడిని చేధించేందుకు ప్రజల నేతృత్వంలో ప్రత్యక్ష చర్య అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
మార్చి నుండి ఇజ్రాయెల్ గాజాలోకి వెళ్లే అన్ని ప్రవేశ కేంద్రాలను మూసివేసిన తరువాత, గాజాలో UN మానవ నిర్మిత కరువు ఏర్పడ్డాక స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇదిలా ఉండగా గాజా నగరం చుట్టూ ఇజ్రాయెల్ సైనిక ప్రచారం తీవ్రమైంది, ఒక మిలియన్ మందికి పైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సమాచారం.
ఆగస్టు 31 నాటికి, 63,459 మంది పాలస్తీనియన్లు మరణించారని, 160,256 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వేలాది మంది ఆచూకీ తెలియలేదు, 124 మంది పిల్లలు సహా 339 మంది ఆకలితో మరణించారని ఆ ప్రాంతంలోని ఆరోగ్య వర్గాలు తెలిపాయి.