హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ బండారాన్ని బయటపెట్టారు. ఇక్కడినుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని సింథటిక్ మాదకద్రవ్యాల తయారీ యూనిట్‌ను మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న పదార్థం విలువ దాదాపు రూ.12,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద మాదకద్రవ్యాల డెన్ బయటపడటం ఇదే ప్రథమం.
మీరా-భయందర్ వాసాయి-విరార్ (MBVV) పోలీసుల క్రైమ్ డిటెక్షన్ యూనిట్ (సెల్-4) హైదరాబాద్‌లోని చెర్లపల్లిలో ఒక రహస్య మెఫెడ్రోన్ (MD) తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి 12 మందిని అరెస్టు చేసింది.
ఈ దాడిలో, పోలీసులు 5.968 కిలోల మెఫెడ్రోన్, 27 మొబైల్ ఫోన్లు, మూడు నాలుగు చక్రాల వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు ఎలక్ట్రానిక్ తూనికల స్కేళ్లు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.12,000 కోట్లు ఉంటుందని MBVV పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్ తెలిపారు.
ఒక నెలకు పైగా జరిగిన ఈ ఆపరేషన్, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన కఠినమైన ప్రయత్నం అని ఆయన వివరించారు. “ఈ అరెస్టులు ముఖ్యమైనవి ఎందుకంటే, సాధారణంగా, పెడ్లర్లు, ఫ్రంట్‌లైన్ పంపిణీదారులు మాత్రమే పట్టుబడతారు. ఈ సారీ మేము తయారీదారులను పట్టుకోవడం చాలా అరుదైన విషయమే కాదు… చాలా సవాలుతో కూడుకున్నది” అని కౌశిక్ అన్నారు.
ఆగస్టు 8న థానే జిల్లాలోని మీరా రోడ్ తూర్పులోని కాశీమిరా బస్ స్టాప్ సమీపంలో 23 ఏళ్ల బంగ్లాదేశ్ జాతీయురాలు ఫాతిమా మురాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశాక ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రోన్‌ను పట్టుబడింది.
తదుపరి దర్యాప్తులో పలువురు అనుమానితుల నుండి 178 గ్రాముల డ్రగ్స్‌తో పాటు రూ. 23.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద అక్రమ రవాణా సిండికేట్‌ను బహిర్గతం చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో తెలంగాణకు వస్తున్నను సప్లై చైన్‌ను గుర్తించారు. కాగా, మాదకద్రవ్యాల కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు
దీని ఆధారంగా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ బదఖ్‌తో పాటు అతని బృందం తెలంగాణకు వెళ్లింది. చెర్లపల్లిలోని నవోదయ కాలనీలో డ్రగ్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతని సహచరుడు తనాజీ పండరినాథ్ పట్వారీపై దృష్టి సారించింది. శుక్రవారం నిర్వహించిన దాడిలో, ఈ ఇద్దరితో పాటు ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతరులను అరెస్టు చేశారు.
స్థానిక పెడ్లర్ల నుండి తయారీదారుల వరకు ఈ అరెస్టులలో అనుమానితులు ఉన్నారని పోలీసులు తెలిపారు, ఇది వ్యవస్థీకృత సింథటిక్ డ్రగ్ రాకెట్‌లను అరికట్టడంలో ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది. అంతేకాదు క్రైమ్ డిటెక్షన్ యూనిట్…సెల్-4 ఈ కేసుపై మరింత దర్యాప్తు నిర్వహిస్తోం. భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.