హైదరాబాద్: తమ జీతాలలో అకస్మాత్తుగా కోత విధించారని ఆరోపిస్తూ నాంపల్లిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) ప్రధాన కార్యాలయం వెలుపల దాదాపు 200 మంది ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సమాచారం లేకుండానే మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీ, అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై కోత విదించడం సరికాదని గురుకుల ఉపాధ్యాయులు అన్నారు. ఈ జీవోను రద్దు చేసి తగ్గించిన వేతనాలను తిరిగి ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
ఒక్కసారిగా వేతనాల్లో కోతలు విధించడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, గురుకులలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు నేర్పించే గురువుల వేతనాలపై కోత విధించడం సమంజసం కాదన్నారు. “మేము విద్యార్థులకు బోధించడానికి మా జీవితాన్ని అంకితం చేసాం. కానీ జీతాల్లో కోత పెట్టడం అన్యాయం ఆమోదయోగ్యం కాదు. ఈ నిర్ణయం కారణంగా మాలో చాలా మంది ఇంటి ఖర్చులను నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నాము” అని నిరసన తెలుపుతున్న ఒక ఉపాధ్యాయుడు అన్నారు.
విశ్వసనీయం సమాచారం మేరకు, ఒక సీనియర్ అధికారి వచ్చి సరైన జీతాలు సకాలంలో చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. “ఈ విషయ మా దృష్టికి వచ్చింది. పొరపాటు తెలిసింది. లోపాన్ని సరిదిద్దుతాము. నేను ఆర్థిక కార్యదర్శితో కూడా మాట్లాడాను. ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు సరైన జీతాలు అందుతాయి” అని అధికారి తెలిపారు. మీరందరూ ఓపిక పట్టాలని నేను కోరుతున్నాను. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి” అని ఆయన అన్నారు.