దుబాయ్: ఆసియా కప్‌లో భారతజట్టు విజేతగా నిలిచింది. ఆ గెలుపు తర్వాత మైదానంలో పెద్ద హైడ్రామా నడిచింది. బహుమతి ప్రధానోత్సవంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా కప్ 2025 ట్రోఫీ గెలిస్తే.. ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) ఛైర్మన్, పీసీబీ ఛైర్మన్, పాకిస్తాన్ మంత్రి అయిన మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా ఇష్టపడలేదు. దాంతో వేదికపైకి వచ్చిన నక్వీ.. టీమిండియా ప్లేయర్లు టైలిల్ అందుకోవడానికి రాకపోవడంతో ట్రోఫీ ఇవ్వకుండానే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లాడు.
అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం టీమిండియాను పిలుస్తారు అనగా… వ్యాఖ్యాత సైమన్ డౌల్ ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్, భారత క్రికెట్ జట్టు ఈ రాత్రి వారి అవార్డులను తీసుకోదని ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ నాకు తెలియజేసింది అంటూ డౌల్ ఒక్కసారిగా కార్యక్రమానికి ఎండ్ కార్డ్ వేశారు. దాంతో ఒక్కసారిగా అక్కడి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
పాకిస్తాన్ ఆటగాళ్లతో ‘హ్యాండ్‌షేక్ నో చెప్పడం’,వారితో మైదానం వెలుపల ఎటువంటి మీటింగ్‌లు చేపట్టకపోవడం అనేది మన పాలసీలో భాగం. అయితే బహుమతి ప్రధానోత్సవంలో నఖ్వీ వేదికపై సిద్ధంగా ఉండగా, భారత ఆటగాళ్ళు ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గారు, వేదికపైకి వెళ్లడానికి నిరాకరించారు. జట్టు యాజమాన్యం ప్రెజెంటర్ గురించి విచారించింది. ACC చైర్మన్ నఖ్వీని ట్రోఫీని అందిస్తారని స్పష్టం చేయడంతో మన ఆటగాళ్లు వెనక్కి తగ్గారు.
కాగా, బహుమతి ప్రధానోత్సవానికి ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ వేదికపైకి రాగానే, స్టాండ్లలోని భారత అభిమానులు ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేస్తూ, నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతకు ముందు మ్యాచ్ ముగియగానే ట్రోఫీ ఎవరు అందజేస్తారు? అనే విషయం కూడా ప్రస్తావనలోకి వచ్చింది. నక్వీ చేతి నుంచి ట్రోఫీ అందుకోవడానికి తాము సిద్ధంగా లేమంటూ కూడా టీమిండియా స్పష్టం చేసింది. అయినా కూడా నక్వీ గ్రౌండ్లోకి రావడంతో కాస్తంత గందరగోళం ఏర్పడింది. కానీ.. చివరికి టీమిండియా అనుకున్నట్లే ట్రోఫీని బహిష్కరించడంతో.. నక్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో తీసుకు వెళ్లాడు.
ఈపరిణామంపై బీసీసీఐ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పెద్ద మనిషి ట్రోఫీ, పతకాలను తన హోటల్ గదికి తీసుకెళ్లడం సరైనది కాదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది చిన్నపిల్లచేష్టలా ఉంది. ట్రోఫీ, మెడల్స్‌ను వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి ఇస్తారని మేం ఆశిస్తున్నాం. లేకుంటే నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చర్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.