Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం !

Share It:

తిరువనంతపురం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌-SIRను వ్యతిరేకిస్తూ కేరళ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు కొన్ని సవరణలను సూచించారు, వాటిలో కొన్నింటిని తీర్మానం ఆమోదించడానికి ముందే ఆమోదించారు.

మతం ఆధారంగా పౌరసత్వం ఇచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించేవారు SIR ప్రక్రియను ఉపయోగించుకోవచ్చని, ఇది ప్రజాస్వామ్యానికి సవాలుగా మారుతుందని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. “ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఇటువంటి చర్యలను ధిక్కరిస్తూ, ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను పారదర్శక మార్పులు చేపట్టాలని ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా కోరుతోంది” అని అది పేర్కొంది.

తొందరపాటుగా SIR అమలు చేయడాన్ని అసెంబ్లీ విమర్శించింది, ఈ ప్రక్రియకు దీర్ఘకాలిక సంప్రదింపులు అవసరమని పేర్కొంది. కేరళలో త్వరలో స్థానిక సంస్థలకు, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున, SIR ను హడావిడిగా నిర్వహించడం దురుద్దేశంతో కూడుకున్నదిగా కనిపిస్తుందని, ప్రజల ఇష్టాన్ని దెబ్బతీస్తుందని తీర్మానం హెచ్చరించింది.

2002 ఓటరు జాబితాపై సవరణను కూడా ఇది విమర్శించింది, దీనిని అశాస్త్రీయమని పేర్కొంది. SIR ప్రకారం 1987 తర్వాత జన్మించిన ఓటర్లు… తల్లిదండ్రులిద్దరి పౌరసత్వ పత్రాలను సమర్పించినట్లయితే మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనవచ్చని, 2003 తర్వాత జన్మించిన వారు ఇలాంటి పరిమితులను ఎదుర్కొంటున్నారని తీర్మానం హైలైట్ చేసింది. ఈ నిబంధనలను వయోజన ఓటింగ్ హక్కులు,రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కింద హామీ ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కు ఉల్లంఘనలుగా అభివర్ణించింది.

తీర్మానంలో ఉదహరించిన ఇటువంటి నియమాలు మైనారిటీ సమూహాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు,పేద కుటుంబాలతో సహా అట్టడుగు వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరించారు. SIRను తొందరపడి నిర్వహిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు ముప్పు వాటిల్లుతుందని, పౌరుల హక్కులను కాపాడే ఓటరు జాబితా పారదర్శక సవరణ ద్వారా దీనిని ఎదుర్కోవాలని పునరుద్ఘాటిస్తూ తీర్మానం ముగిసింది.తిరువనంతపురం:

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.