32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌కు ‘వరల్డ్ గ్రీన్ సిటీ’ అవార్డు!

హైదరాబాద్:  అంత‌ర్జాతీయ స్థాయిలో విశ్వ న‌గ‌రం హైద‌రాబాద్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) అందజేసే వ‌ర‌ల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022ను గెలుచుకుంది. పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డులను దక్కించుకుంది. ఈ అంతర్జాతీయ అవార్డు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణం.

భారత్‌ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్‌ కావడం విశేషం.  ఏఐపీహెచ్ ఆరు కేటగిరీల్లో ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ కోసం ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరీల్లో మొత్తం 18 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు.  ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్’ కేటగిరీలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పచ్చదనాన్ని హైదరాబాద్ ఎంట్రీగా సమర్పించారు. ఫైనల్ కేటగిరీల వారీగా శుక్రవారం విజేతలను ప్రకటించారు. ఈ కేటగిరీ నగరవాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, వృద్ధి చెందడానికి అనుమతించే వ్యవస్థలు, ఇత‌ర పరిష్కారాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. ‘తెలంగాణ రాష్ట్రానికి హరిత నెక్లెస్’గా పిలుచుకునే ‘ఓఆర్ఆర్’ పచ్చదనం ఈ కేటగిరీలో ఉత్తమమైనదిగా ఎంపికైంది.

ఈ ఘనత సాధించినందుకు మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఏ) బృందాన్ని,MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) అభినందించారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles