24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో డాబాపై కూరగాయల సాగుకు ప్రభుత్వ సాయం!

హైదరాబాద్: కూరగాయలు పండించాలంటే ఎకరాలు కావాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు మీరు మీ పెరట్లో, బాల్కనీ, టెర్రస్‌లో కూడా కొన్ని కూరగాయలను  పెంచుకోవచ్చు. పట్టణాలు, నగరాలు కాంక్రీట్‌ జంగిళ్లుగా మారిపోతున్న నేపథ్యంలో ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలను తమ ఇంటిపైన సిమెంటు మడుల్లో పండించుకునేందుకు చాలామంది నగర పౌరులు ఉత్సాహం చూపుతున్నారు.

కరోనా నేర్పిన గుణపాఠంతో ప్రస్తుతం అనేకమంది బయటకు వెళ్లకుండా తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను ఇంట్లోనే పండిస్తున్నారు. తమకున్న వసతిని బట్టి ఇంటి పెరట్లో, డాబాపై సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో మొక్కలు పెంచడం, టెర్రస్ గార్డెనింగ్‌పై పౌరులు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని ఉద్యానవన శాఖ మొక్కలను పెంచడంలో ప్రజలకు సహాయపడటానికి మరోసారి ముందుకు వచ్చింది.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని నివాసితులకు టెర్రస్‌లు, బాల్కనీలు, బహిరంగ ప్రదేశాల్లో కూరగాయలు పండించడంపై ఉద్యానవన శాఖ పట్టణ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా వారికి సహాయాన్ని అందించనుంది.

తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ప్రతి నెలా పట్టణ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. శిక్షణా సెషన్లలో, నిపుణులు టెర్రస్,  బాల్కనీలో కూరగాయలను ఇచ్చే మొక్కలను ఎలా పెంచాలనే దాని గురించి మాట్లాడతారు.

ప్రతి నెల నాల్గవ ఆదివారం నాడు శిక్షణ నిర్వహిస్తారు. ఈ నెల 24న రెడ్‌హిల్స్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు పక్కన ఉన్న తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించనున్నారు. రూ. 100 చెల్లించి శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం +91 97053 84384, +91 7997725411, +91 76740 72539, లేదా +91 79977 24983 నంబర్లలో సంప్రదించవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles