30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ భారత్ జోడో యాత్ర!

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న కర్ణాటక నుంచి  తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఎదురెళ్లి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం కర్నాటక పీసీసీ డీకే శివ కుమార్.. రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జాతీయ జెండాను అందజేశారు. రాహుల్ పాదయాత్ర ఇప్పటికి 4రాష్ట్రాల్లో పూర్తికాగా.. తెలంగాణ ఐదోవది. రాష్ట్రంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీని చూసేందుకు జనం భారీగా  తరలివచ్చారు.  రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తల సందడితో కృష్ణా నది బ్రిడ్డి జన సంద్రమైంది.

భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం గూడబల్లేరు వద్ద టీపీసీసీ ఏర్పాటు చేసిన తొలి సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు అని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్.. రెండూ కలిసి దేశంలో మతకల్లోలాలు సృష్టించి దేశాన్ని విచిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని.. వారి కుటిల ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో దేశ సమైక్యత కోసమే తాను ఇలా భారత్ జోడో యాత్ర చేపట్టానన్నారు. భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

భారత్ జోడో యాత్రలో 3 రోజులు దీపావళి బ్రేక్
కన్యాకుమారిలో సెప్టెంబర్ 6న ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో పాత యాత్ర నేడు తెలంగాణలోకి ప్రవేశించగా.. రాష్ట్రంలో 16 రోజుల పాటు 376 కిలో మీటర్లు పర్యటించిన అనంతరం తెలంగాణ నుండి మహారాష్ట్రలోకి ఎంటర్ కానున్నారు. ఇదిలావుంటే, దీపావళి సందర్భంగా భారత్ జోడో యాత్రకు 3 రోజులు పాటు విరామం ఇస్తున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి భారత్ జోడో యాత్రను తిరిగి ఇక్కడి నుంచే మొదలు పెట్టనున్నట్టు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.

ఆ తర్వాత అక్టోబరు 27న ఉదయం గూడెంబెల్లూరు నుంచి యాత్ర తిరిగి ప్రారంభం అయ్యి మక్తల్‌కు చేరుకుని, తెలంగాణలో 16 రోజుల పాటు కొనసాగుతుంది, 19 అసెంబ్లీ, ఏడు పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ 375 కి.మీ.ల దూరం కవర్ చేస్తుంది.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రతిరోజూ 20-25 కి.మీ ‘పాదయాత్ర’ చేపడతారు. ప్రజలతో మమేకమవుతారు.  మేధావులు, వివిధ సంఘాల నేతలు, రాజకీయ, క్రీడా, వ్యాపార, సినీ రంగ ప్రముఖులతో భేటీ కానున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను రాహుల్ సందర్శించనున్నారు. మతాల మధ్య ప్రార్థనలు కూడా జరుగుతాయని టీపీసీసీ తెలిపింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles