Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు!

Share It:

వాషింగ్టన్‌: అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుండి ఇంటికి వస్తున్న 5 ఏళ్ల బాలుడిని ఫెడరల్ ఏజెంట్లు అతని తండ్రితో పాటు టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. బాలుడిని ‘ఎర’గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుండగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ఆరోపణలను ఖండించింది.

ఫెడరల్ ఏజెంట్లు మంగళవారం మధ్యాహ్నం కుటుంబం డ్రైవ్‌వేలో నడుస్తున్న కారు నుండి లియామ్ కోనెజో రామోస్‌ను తీసుకెళ్లారని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ విలేకరులకు తెలిపారు. ఏజెంట్లు బాలుడి చేత ఇంటి తలుపు తట్టించి, లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూశారని, ఇది బాలుడిని ఎరగా వాడటమేనని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్‌విక్ ఆరోపించారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఒక ప్రకటనలో “ICE పిల్లవాడిని లక్ష్యంగా చేసుకోలేదు” అని అన్నారు. ఆ పిల్లవాడి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్‌ చట్టవిరుద్ధంగా USలో ఉన్నాడని చెప్పారు. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆ పిల్లవాడి తండ్రిని అరెస్టు చేయడానికి రాగా… అతను “తన బిడ్డను విడిచిపెట్టి పారిపోయాడు” అని ఆమె చెప్పింది. దీంతో అధికారులు కోనెజోను అరెస్టు చేశారు” అని మెక్‌లాఫ్లిన్ అన్నారు. ప్రస్తుతం తండ్రీకొడుకులను టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. పిల్లాడి భద్రత కోసం ఓ అధికారి అతడితో ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఆ చిన్నారి తండ్రి ఆశ్రయం కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకున్నారని కుటుంబ న్యాయవాది తెలిపారు.

ఈ ఘటనను అమెరికా మాజీ ఉపాధ్యక్షులు కమలా హారిస్‌ ఖండించారు. ఇది నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది” అని ఆమె అన్నారు. అయితే, ఈ ఆపరేషన్‌ను ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు. చట్టాన్ని అమలు చేస్తున్న అధికారులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

కమలా హారిస్‌ ఎక్స్ పోస్ట్

https://twitter.com/KamalaHarris/status/2014478583616487557/video/1

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.