28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

జీహెచ్ఎంసీ పార్కుల్లో ‘ఓపెన్ జిమ్‘‌లకు విశేష ఆదరణ!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) నగరంలోని పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సౌకర్యాలకు పౌరుల నుండి మంచి స్పందన, ఆదరణ లభిస్తోంది. నగరపాలక సంస్థ హైదరాబాద్ లో ప్రజా ప్రయోజనం కోసం లక్షల రూపాయల విలువైన పరికరాలతో 137 ఓపెన్ జిమ్‌లను ప్రారంభించింది. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ నగరంలో లేని ఈ ఓపెన్ జిమ్‌ల ద్వారా 45,000 మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రజల కోసం సామాజిక మౌలిక సదుపాయాలతో పాటు, పౌరుల ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరచడానికి జీహెచ్ఎంసీ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాయామానికి తగిన సౌకర్యాలు కల్పించడంతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చింది. అలాగే, పౌరులలో శారీరక శ్రమను పెంచడానికి పార్కుల వద్ద ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. “క్రీడా క్షేత్రాల ద్వారా వ్యాయామంతో పాటు సాంప్రదాయ, ఆధునిక క్రీడలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఓ అధికారి తెలిపారు. GHMC నగరం అంతటా 146 ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో 137 ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. మరో 9 నిర్మాణంలో ఉన్నాయి.

జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం… ఎల్.బి.నగర్ జోన్‌లో  23 ఓపెన్ జిమ్‌లను, చార్మినార్‌లో 18 ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ మండలంలో మొత్తం 30, శేరిలింగంపల్లిలో 24 అందుబాటులో ఉండగా అందులో 23 పూర్తయ్యాయి. ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది.

మొత్తం 37 ఓపెన్ జిమ్‌లతో కూకట్‌పల్లి జోన్‌లో 35, సికింద్రాబాద్‌లో 14 ఓపెన్ జిమ్‌లలో 5 పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles