న్యూఢిల్లీ: దేశంలో పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన తెలిపిన యువత ధైర్యాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశంసించారు. పేపర్ లీక్‌ల ఆరోపణలపై అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ గత నెలలో నిరసన తెలిపిన విద్యార్థులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను గాంధీ సోషల్‌మీడియాలో షేర్ చేసారు. జూలై 20న జరిగిన ఆ నిరసన సందర్భంగా విద్యార్థులు పోలీసుల దురాగతాలను ఎదుర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థులు తమ గళం విప్పిన తర్వాత, పోలీసులు తమపై “క్రూరత్వం”, “వేధింపులకు” పాల్పడ్డారని వారు చెప్పిన విషయాలను తాను విన్నానని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సంభాషణ ఈ నెల ప్రారంభంలో జరిగింది.
“మోదీజీ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా, జవాబుదారీతనం కోరుతూ భారతదేశ యువత దృఢంగా నిలబడిన ధైర్యం, స్థైర్యం ప్రశంసనీయం.” విద్యార్థులు “శాంతి, ప్రేమ, హాస్యంతో” తమ గళం విప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి ఒక్క యువత పట్ల నేను గర్వపడుతున్నాను -ముఖ్యంగా అమ్మాయిల గొంతులను అణచివేయలేరని ఆయన అన్నారు.
కాగా, రాహుల్ గాంధీతో పాటు మీడియా ముందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులలో మోడల్ రియా అహిర్ కూడా ఉన్నారు. ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో ఆమె ఒక పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న చిత్రం వైరల్ అయింది. ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యానని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఈమేరకు విద్యార్థులతో సంభాషించే “ఛాత్రోన్ కీ గూంజ్” అనే కార్యక్రమం ఆగస్టు 22న పూణేలో జరుగుతుందని, ఇది ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. “ఇప్పుడు, అమ్మాయిలు మాట్లాడతారు, దేశం వింటుంది,” అని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల సమస్యలను నేరుగా వినడం, వారి అనుభవాలను దేశ ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్ని కూడా రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఛత్రోం కీ గూంజ్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ నిరసనలు చీకటిలో వెలుగు దివ్వెలా నిలిచాయని, తమ భయాల్ని పక్కనబెట్టి పోరాడిన యువతకు శుభాకాంక్షాలు తెలిపారు. అయితే సమస్యల్ని పరిష్కరించేందుకు ద్వేషం, హింసను ఆశ్రయించబోమని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ ‘ప్రేమ, ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తాం’ అని చెబుతూ, యువత కూడా అదే మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు హాజరయ్యారు.
भारत के युवाओं ने मोदी जी के हिंसक शासन के सामने जिस साहस और मजबूती से खड़े होकर जवाबदेही की मांग की, वह काबिल-ए-तारीफ है।
— Rahul Gandhi (@RahulGandhi) August 16, 2026
उन्होंने शांति, मोहब्बत और हंसी-मज़ाक के साथ अपनी आवाज़ बुलंद की।
मुझे हर एक युवा पर गर्व है – खासकर उन लड़कियों पर, जिन्हें BJP के गुंडों की बदसलूकी,… pic.twitter.com/JOVCj4WCkd
