Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు…మనకు గర్వకారణమా?సంస్కరణకు సమయమా!

Share It:

పాఠకులారా, మే 31న హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోందనే వార్త మీరు వినే ఉంటారు. ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఈ చారిత్రాత్మక నగరం ఇప్పుడు ప్రపంచ అందాల పోటీకి వేదికగా మారడానికి సిద్ధమవుతోంది.

సమాజంలోని అనేక వర్గాలు ఈ కార్యక్రమాన్ని గర్వంగా చెప్పుకోవడమే కాదు ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ ఈ కథనం చదివిన తర్వాత, మీరే నిర్ణయించుకోవాలి: ఇది నిజంగా మనకు గర్వకారణమా, లేదా ఆందోళనకు ప్రతిబింబమా? ఇది ఆత్మపరిశీలనకు, సంస్కరణకు సమయం కాదా?

హైదరాబాద్ కేవలం దాని శిల్ప కళావైభవానికి, బిర్యానీ, ఇరానీ చాయ్‌కి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. ఈ నగరం శతాబ్దాల నాటి గొప్పతనం, మర్యాద, ఉన్నతమైన మానవ విలువలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ నగర వీధులు ఒకప్పుడు మతపండితుల శోభతో వెలిగిపోయాయి. అక్కడి గాలి మేథావుల ప్రసంగాలతో పరిమళించింది.

మర్యాదను ఆభరణంగా భావించే ఈ హైదరాబాద్‌లో ఇప్పుడు – మిస్ వరల్డ్ 2025 జరగబోతోంది. ఇలాంటి కార్యక్రమం ఇస్లామిక్ నైతిక విలువలకు పూర్తి విరుద్ధంగా ఉండటమే కాకుండా, హైదరాబాద్ దక్కన్ సాంస్కృతిక ఆత్మకు ద్రోహం చేసే ప్రదర్శన కూడా అని చెప్పవచ్చు.

109 దేశాల నుండి పాల్గొనేవారు వేదికపై తమ శరీరాలను ప్రదర్శించడం, ఫ్యాషన్, గ్లామర్ దృశ్యంలో వారి శారీరక రూపాన్ని బట్టి మాత్రమే అంచనా వేయడం – ఇది కేవలం ప్రదర్శన కాదు, స్త్రీ గౌరవం, అంతేకాదు ఆ గౌరవాన్ని అంతర్జాతీయ వేలం వేయడం నిజంగా శోచనీయం.

ఇస్లామిక్ బోధనలలో స్త్రీలను వినయం, పవిత్రత, గౌరవానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆమెను ప్రదర్శనల పోటీలో వేదికపై “షోపీస్”గా ప్రదర్శించరు సరికదా – ఆమెను తల్లి, సోదరి, కుమార్తె భార్య వంటి పవిత్ర పాత్రలలో గౌరవిస్తాం.

కానీ పాశ్చాత్య నాగరికత మహిళలను ప్రకటనలు, ఫ్యాషన్ షోలు, అందాల పోటీల వస్తువులుగా పరిగణించింది. స్త్రీ రూపాన్ని ఇప్పుడు శారీరక ఆకర్షణ ద్వారా మాత్రమే కొలుస్తారు, ఇది యువ తరాల హృదయాలను, మనస్సులను ప్రభావితం చేసే ఒర ప్రమాణాన్ని మాత్రమే సృష్టిస్తుంది.

ఈ “ అందమైన సీతాకోకచిలుకలు” చూపుల మర్యాదను నాశనం చేస్తాయి. అవి మనస్సులలో, హృదయాలలో కామ తుఫానులను రేకెత్తిస్తాయి. ఈ తుఫానులు ఆలోచనలకే పరిమితం కావు; అవి త్వరలోనే లైంగిక నేరాల రూపంలో, మహిళలపై హింస రూపంలో తీవ్రమైన నైతిక క్షీణతకు కారణమవుతాయి. ఫలితంగా సమాజం తన శాంతిని కోల్పోతుంది, ధర్మం అనే కొవ్వొత్తి ఆరిపోతుంది.

అందాల పోటీల్లో స్త్రీ శరీర ప్రదర్శన, తద్వార లభించే ఈ అంతర్జాతీయ కీర్తిని మన యువతులు చూసినప్పుడు, వారు కూడా ఈ ప్రమాణాలకు లొంగిపోవడం ద్వారానే విజయం, పేరు ప్రఖ్యాతులు సాధించగలమని నమ్మడం ప్రారంభిస్తారు. వారు “నా శరీరం, నా ఎంపిక” వంటి నినాదాలను ఇవ్వడం ప్రారంభిస్తారు మరియు ఒకప్పుడు వారి గౌరవాన్ని కాపాడిన మర్యాద ముసుగును కూల్చివేస్తారు.

దీంతో కుటుంబ జీవితం పునాదులు కదలడం ప్రారంభిస్తాయి. సామాజిక విలువలు కూలిపోతాయి. తరువాతి తరం నైతిక సమతుల్యత విచ్ఛిన్నమవుతుంది.

కాబట్టి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నిజంగా ప్రశంసనీయమైన మహిళ ఎవరు?

శారీరక ప్రదర్శన ద్వారా ప్రశంసలు పొందే వ్యక్తి? లేదా వ్యక్తిత్వం, జ్ఞానం, మర్యాద, గౌరవం నిండిన వ్యక్తి- తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన విశ్వాసాన్ని ఉన్నత స్థానంలో నిలుపుకున్నా వ్యక్తా? అనేది మనం నిర్ణయించుకోవాలి.

గుర్తుంచుకో! స్త్రీ అంటే అలంకరించుకోవాల్సిన వస్తువు కాదు. ఆమె మర్యాద, గౌరవానికి ప్రతిరూపం, గౌరవాన్ని మోసే వ్యక్తి, న్యాయమైన సమాజానికి పునాది. ఆమె నిజమైన పాత్ర కుటుంబ సంబంధాల పవిత్రతలో ఉంది – ప్రేమగల తల్లిగా, అమాయక కుమార్తెగా, నమ్మకమైన సోదరిగా, అంకితభావంతో కూడిన భార్యగా ఉండాలే తప్ప బ్యూటీ ర్యాంప్ పై ఒక ప్రదర్శనగా లేదా వాణిజ్య ప్రకటనలలో ఒక ప్రదర్శనగా కాదు.

మనం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతామా?

అర్థం చేసుకోండి—ఇది కేవలం అందాల పోటీ కాదు. ఇది నాగరికతల ఘర్షణ. వినోదం ముసుగులో ఉన్న సాంస్కృతిక దండయాత్ర. నేడు మనం మౌనంగా ఉంటే, రేపు మన గోడలు కూలిపోతాయి, మన పిల్లల కలలు చెదిరిపోతాయి. మనస్సాక్షి నశించిపోతుంది.

సోషల్ మీడియాలో వ్యాఖ్యలతో మాత్రమే కాకుండా, మేధో, మత, విద్యా, సాంస్కృతిక స్థాయిలలో వ్యవస్థీకృత ప్రతిఘటన ద్వారా ప్రతిస్పందించాల్సిన సమయం ఇది. ఈ అనైతిక తుఫానుకు వ్యతిరేకంగా మనం మన స్వరాన్ని పెంచాలి.

ముస్లిం సమాజం, ముఖ్యంగా సమాజ సంస్కరణ కోసం కృషి చేసే సామాజిక, మత సంస్థలు, నైతిక స్పృహ ఉన్న పౌరులు ఈ ధోరణికి వ్యతిరేకంగా నిలబడటం చాలా అవసరం. మనం ప్రతి వేదికపైనా మన గళాన్ని వినిపించాలి – డిజిటల్‌గా మాత్రమే కాకుండా విద్యాపరంగా, సాంస్కృతికంగా కూడా ప్రతి వేదికపై మనం మన గళాన్ని వినిపించాలి. ఈ సైద్ధాంతిక దాడికి స్పష్టంగా, తార్కికంగా సమాధానం ఇవ్వాలి.

  • జయీముద్దీన్‌ అహ్మద్‌
    రాష్ట్ర మీడియా సెక్రటరీ, జేఐహెచ్‌, తెలంగాణ.
Tags :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.