Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

దీపావళి ఆన్‌లైన్ మోసాలపై హెచ్చరించిన హైదరాబాద్‌ సీపీ!

Share It:

హైదరాబాద్‌: దీపావళి షాపింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దివ్వెల పండుగ ముందు నగర పౌరులకు పోలీస్ కమిషనర్ V.C. సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. ఈ పండుగ సమయంలో వేర్వేరు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటానికి రకరకాల డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆఫర్లు ఇస్తాయి. సరిగ్గా దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. నకిలీ ఈ కామర్స్ సైట్ లను సృష్టించి వాటి ద్వారా భారీ తగ్గింపుల పేరిట జనాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరికొందరు క్రిమినల్స్… ఏపీకే ఫైళ్లను పంపించి వాటిని డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేయించటం ద్వారా అవతలి వారి ఫోన్లను హ్యాక్ చేస్తూ ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇంకొందరు ఫిషింగ్ లింకుల పంపిస్తూ జనం కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు.

ఇటీవలి వెలుగులోకొచ్చిన రెండు కేసులు సమస్యను హైలైట్ చేస్తాయి: సికింద్రాబాద్‌లో, బహుమతి-ఆఫర్ సైట్‌లో ఓ మహిళ 1.4 లక్షలు కోల్పోయింది. అజంపురాలో, నకిలీ సపోర్ట్ నంబర్ ద్వారా పంపించిన APK ఫైల్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒక వ్యక్తి లక్షకు పైగా కోల్పోయాడు.

ఈమేరకు నగర కమిషనర్ సజ్జనార్ ప్రజలకు భద్రతా చిట్కాలు తెలిపారు. పరిచయం లేని వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవద్దన్నారు. పండుగ సందర్భంగా గిఫ్ట్ వచ్చింది…స్పెషల్ డిస్కౌంట్ ఇస్తామన్న మాటలు నమ్మవద్దన్నారు.

ఒకేవేళ మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు www.cybercrime.gov.in సైట్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మొదటి గంటలో కంప్లయింట్ ఇస్తేనే సైబర్ మోసగాళ్లు దోచుకున్న డబ్బును బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయన్నారు. ధృవీకరించని లింక్‌లలో OTPలు, PINలు లేదా కార్డ్ సమాచారాన్ని ఎప్పుడూ ఇతరులకు తెలపవద్దని కోరారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.