హైదరాబాద్: హైదరాబాద్‌లో కేరళ ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్‌పై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసారు. బీఫ్ వడ్డిస్తున్నందుకు ఆ హోటల్‌ను బలవంతంగా మూసివేయడానికి ప్రయత్నించారు. జోష్యేట్టన్ కేరళ తట్టుకాడ అనే రెస్టారెంట్ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సమీపంలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) సమీపంలో ఉంది.
రెస్టారెంట్‌లో ఉన్న EFLU విద్యార్థుల ప్రకారం…VHP, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రదేశంలోకి వచ్చి బీఫ్ వడ్డిస్తే అవుట్‌లెట్ మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత అక్కడి నుండి అందరూ వెళ్లిపోవాలని కోరారు. కేరళలో బీఫ్ చాలా సాధారణంగా తింటారని, పరోటా,బీఫ్ ఫ్రై/కూర అనేది మలయాళీలు, చాలా మంది హిందువులు ఇష్టపడే రుచికరమైన వంటకం అన్నది గమనార్హం.
ఈ విషయమై పోలీసులను ప్రశ్నించగా… OU పోలీస్ స్టేషన్ అధికారులు స్పందించలేదు. అయితే, సంఘటన జరిగిన సమయంలో రెస్టారెంట్‌లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ… చివరికి పోలీసులు అక్కడికి చేరుకుని విషయం మరింత పెరగకుండా నిరోధించారని చెప్పారు.
తెలంగాణలో గొడ్డు మాంసం తినడంపై నిషేధంలేదు. హైదరాబాద్ అంతటా అనేక ప్రదేశాలు బహిరంగంగా గొడ్డు మాంసం వడ్డిస్తాయి. అయితే, ఈ వంటకాన్ని అందించే చాలా రెస్టారెంట్లు హైదరాబాద్‌లోని పాత నగర ప్రాంతాలలో, ప్రధానంగా ముస్లిం ఏరియాల్లో ఉన్నాయి.
అయితే రెస్టారెంట్లు సాధారణంగా గొడ్డు మాంసం వడ్డించవు. ప్రధానంగా చికెన్, మటన్, సముద్ర ఆహారాన్ని విక్రయిస్తాయి. వాస్తవానికి, అక్సన్ అనే పురాతన కేరళ వంటకాల రెస్టారెంట్ కూడా హైదరాబాద్‌లో గొడ్డు మాంసం వడ్డించదు.
EFLU సమీపంలో జరిగిన సంఘటన హైదరాబాద్‌లో మొదటిసారి అయినప్పటికీ, కేరళ ఆహారాన్ని అందించే ప్రదేశం రైట్-వింగ్ వర్గాలు లక్ష్యంగా చేసుకోవడం భారతదేశంలో ఇదే మొదటిసారి కాదు.


