Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘ఇమ్మిగ్రెంట్స్‌’ వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేసిన అమెరికా!

Share It:

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర రాజ్యాధిపతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల వర్క్‌పర్మిట్ల (EAD) ఆటోమేటిక్ పొడిగింపును నిలిపివేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విదేశీ ఉద్యోగులు ప్రభావితం అయ్యేఅవకాశం ఉంది, వీరిలో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం.

ఈ ఏడాది అక్టోబర్ 30 (నేటినుంచి) లేదా ఆ తర్వాత తమ EADని పునరుద్ధరించడానికి దాఖలు చేసే విదేశీయులు ఆటోమేటిక్ పొడిగింపును పొందరు అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అక్టోబర్ 30కి ముందు పొడిగించిన వర్క్​ పర్మిట్లు ప్రభావితం కావు. కొత్త నిబంధనతో ప్రజా భద్రత, జాతీయ భద్రతను కాపాడటానికి తనిఖీ, స్క్రీనింగ్ ఎక్కువగా ఉంటుంది అని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది.

బైడెన్​ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజులు పని చేయడానికి అనుమతి ఉంది. దీంతో వర్క్​ పర్మిట్​ రెన్యువల్​ అయ్యేది. అయితే ఇప్పుడు ఈ తాజాగా విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్‌ సర్కారు కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. వర్క్​ పర్మిట్​ పొడిగింపు కోసం.. వలసదారులు ఇక నుంచి ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే.. వర్క్​ పర్మిట్ పొడిగిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. వలస కార్మికుల నేపథ్యాన్ని సమీక్షించడం కోసం ఈ నిబంధనకు అవసరమని US ప్రభుత్వం చెబుతోంది. తమ EAD గడువు ముగియడానికి 180 రోజుల ముందు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆలస్యంగా దరఖాస్తు చేస్తే వారికే నష్టం వాటిల్లుతుందని, తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

EAD ఎవరికి అవసరం?
EAD (ఫారమ్ I-766/EAD) కలిగి ఉండటం అనేది ఒక వ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధిలో USలో పని చేయడానికి అధికారం ఉందని నిరూపించడానికి ఒక మార్గం.

శాశ్వత నివాసితులు EAD కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. గ్రీన్ కార్డ్ (ఫారమ్ I-551, శాశ్వత నివాసి కార్డ్) ఉపాధి అధికారానికి రుజువు.

వలసేతర హోదా (H-1B, L-1B, O లేదా P) ఉన్న వ్యక్తులకు కూడా ఈ పత్రం అవసరం లేదు.

H-1B వీసా వివాదం
సెప్టెంబర్ ప్రారంభంలో, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును $100,000 (88 లక్షలకు పైగా) పెంచింది. “హెచ్-1బీ వీసా వ్యవస్థ ఎక్కువగా దుర్వినియోగం అవుతోంది. ఈ వీసా అమెరికన్లు ఉద్యోగం చేయని రంగాలలో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ఉద్దేశించింది. అలాంటి వ్యక్తులు ఈ ఉద్యోగాలు చేయడానికి అమెరికాకు వస్తారు” అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు. మాకు గొప్ప కార్మికులు అవసరం, అదే జరగబోతోందని ఆయన అన్నారు.

మరో వంక, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ బుధవారం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి,H-1B వీసాలపై విదేశీ కార్మికులను దిగుమతి చేసుకునే పద్ధతిని ముగించాలని ఆదేశించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.