హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈమేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది.
TSBIE ప్రకారం… ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 17 వరకు నిర్వహించనున్నారు. రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 26 నుండి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్షలు ఉంటాయి.
ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఈమేరకు ఇంటర్ విద్యార్థులకు నవంబరు 1 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమై.. నవంబరు 14తో ముగుస్తుంది. రూ.100 లేటు ఫీజుతో నవంబరు 24 వరకు, రూ.500 ఫైన్‌తో డిసెంబరు 1 వరకు, రూ.1,000 అపరాధ రుసుంతో డిసెంబరు 8 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో డిసెంబరు 15 వరకు చెల్లించవచ్చు. మొదటి ఏడాది ఇంటర్ (జనరల్ – ఇంగ్లీష్ ప్రాక్టికల్స్‌తో కలిపి) రూ.630, (వొకేషనల్ – థియరీ, ప్రాక్టికల్, ఇంగ్లీష్ ప్రాక్టికల్)రూ.870, రెండో ఏడాది ఇంటర్ (జనరల్ సైన్స్)రూ.870, (జనరల్ ఆర్ట్స్ – ఇంగ్లీష్ ప్రాక్టికల్స్) రూ.630 చెల్లించాలి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 25- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
ఫిబ్రవరి 27- ఇంగ్లష్ పేపర్ 1
మార్చి 2- మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఎ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
మార్చి 5- మ్యాథమెటిక్స్ పేపర్ 2 బి, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
మార్చి 9- ఫిజిక్స్ పేపర్ 1 మరియు ఎకనామిక్స్ పేపర్ 1
మార్చి 12- కెమిస్ట్రీ పేపర్ 1 మరియు కమర్స్ పేపర్ 1
మార్చి 14- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1,బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ 1 బైపీసీ విద్యార్థుల కోసం
మార్చి 17- మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం టైమ్ టేబుల్
ఫిబ్రవరి 26- సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
ఫిబ్రవరి 28- ఇంగ్లిష్ పేపర్ 2
మార్చి 3- మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఎ, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
మార్చి 6- మ్యాథమెటిక్స్ పేపర్ 2 బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
మార్చి 10- ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్ పేపర్ 2
మార్చి 13- కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
మార్చి 16- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ 2
మార్చి 18- మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2



