న్యూఢిల్లీ: వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు హిందీ స్కాలర్‌ను ఢిల్లీ నుండి బహిష్కరించిన వారం అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ మాట్లాడుతూ… భారత అధికారులు విశాల దృక్పథం అలవర్చుకోవాల్సిన అవసరముందని అన్నారు.
బిజెపి మాజీ ఎంపి స్వపన్ దాస్‌గుప్తా రాసిన కాలమ్‌కు థరూర్ స్పందిస్తూ, అధికారులు ఇమ్మిగ్రేషన్ విషయాలు చూసుకోవాలి కానీ ప్రొఫెసర్ పాండిత్యాన్ని అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. “భారతదేశం విదేశీ స్కాలర్‌లకు తలుపులు మూసివేసిందనే అభిప్రాయాన్ని నివారించాలి” అని దాస్‌గుప్తా అన్నారు.
ఈమేరకు దాస్‌గుప్తాతో తాను ఏకీభవిస్తున్నానని శశిథరూర్ అన్నారు. “చిన్న వీసా ఉల్లంఘనల కారణంగా విదేశీ పండితులను, విద్యావేత్తలను బహిష్కరించడానికి మన విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉత్సాహం చూపడం సరికాదన్నారు. తద్వారా మనకు మనకు చాలా ఎక్కువ నష్టం జరుగుతోంది” అని ఆయన అన్నారు. ఈమేరకు భారతదేశం విశాల హృదయాన్ని పెంచుకోవాలి” అని థరూర్ X లో పోస్ట్ చేశారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్ అయిన ఓర్సిని, వీసా షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలతో అక్టోబర్ 21న ఢిల్లీ విమానాశ్రయం నుండి బహిష్కరించారు. ఆమె హాంకాంగ్ నుండి వచ్చింది. భారతదేశంలోకి ప్రవేశం నిరాకరించారు.
ఆమె టూరిస్ట్ వీసాలో ఉందని, వీసా షరతులను ఉల్లంఘించిన తర్వాత మార్చిలో బ్లాక్‌లిస్ట్ చేసారని అధికారులు తెలిపారు. “ఒక వ్యక్తి వీసా షరతులను ఉల్లంఘించినట్లు తేలితే, అతన్ని/ఆమెను బ్లాక్‌లిస్ట్ చేయవచ్చు అనేది ఇది ఒక ప్రామాణిక ప్రపంచ పద్ధతి” అని వార్తా సంస్థ PTI ఒక మూలాన్ని ఉటంకిస్తూ తెలిపింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం… విదేశీ పౌరులు వీసా దరఖాస్తును సమర్పించేటప్పుడు ప్రకటించిన సందర్శన ఉద్దేశ్యాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ఇటాలియన్ జాతీయురాలైన ఓర్సిని, లండన్ విశ్వవిద్యాలయానికి వెళ్లే ముందు కేంబ్రిడ్జ్‌లో బోధించారు. ఆమె హిందీ పండితురాలుగా విస్తృతంగా పనిచేశారు. ఆమె పుస్తకం “ది హిందీ పబ్లిక్ స్పియర్ 1920-1940: లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ నేషనలిజం” రచయితగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె బహిష్కరణను చరిత్రకారులు, మేధావులు తీవ్రంగా విమర్శించారు.


