Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

విక్టరీ స్పీచ్‌లో నెహ్రూను ఉటంకించిన మమ్దానీ…ట్రంప్‌కు సవాల్‌!

Share It:

న్యూయార్క్: నగర మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ వలసలపై కఠిన చర్యలు ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేశారు. న్యూయార్క్ వలసదారులచే శక్తిని పొందుతుందని, వలసదారుడి నాయకత్వంలో ఉంటుందని నొక్కి చెప్పారు. తన విజయం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసిందని అన్నారు. అంతేకాదు నేరుగా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్‌.. ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నా వద్ద నాలుగు మాటలు ఉన్నాయి. సౌండ్ పెంచండి. మీరు… మాలో ఎవరినైనా చేరుకోవాలంటే మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు ” ఒక నిరంకుశుడిని భయపెట్టడానికి ఏదైనా మార్గం ఉంటే, అది అతను అధికారాన్ని కూడగట్టుకోవడానికి అనుమతించిన పరిస్థితులను కూల్చివేయడం ద్వారా సాధ్యమవుతుందన్నారు.

“మన నగరంలోని డొనాల్డ్ ట్రంప్‌లు తమ అద్దెదారులను ఉపయోగించుకోవడంలో చాలా సౌకర్యంగా ఉన్నారు కాబట్టి మేము చెడ్డ భూస్వాములను లెక్కలోకి తీసుకుంటాము. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులు ఎగ్గొట్టేందుకు, పన్ను మినహాయింపులను దోపిడీ చేయడానికి అనుమతించిన అవినీతి సంస్కృతిని మేము అంతం చేస్తామని మమ్దానీ అన్నారు.

మార్పు కోసం, నవ శకం కోసం ఈ రాత్రి తీర్పు వెల్లడైంది. జనవరి ఒకటిన నేను మేయర్ గా ప్రమాణస్వీకారం చేస్తాను” అని జొహ్రాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ప్రస్తావించారు. “నవశకం వైపు అడుగువేసినప్పుడు, ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడుతుందని, చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయని” మమ్దానీ అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు.

Xలో మమ్దానీ ప్రసంగం

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.