Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దేనని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా!

Share It:

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్కడక్కడా ఉద్రిక్త ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ బి.సుద‌ర్శ‌న్ రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేసారు. కాగా, ఈ నియోజకవర్గంలో ఎలాఅయినా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఈ ఎన్నిక ఒక అగ్నిపరీక్షగా పరిగణిస్తున్నారు.

రెండు ప్రముఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే చాలా సర్వేలు కాంగ్రెస్ 47 నుండి 48 శాతం ఓటింగ్‌తో విజయం సాధిస్తుందని, BRS 41 నుండి 43 శాతంతో రెండవ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. బిజెపి 5-8 శాతం వరకు రావచ్చు.

జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
చాణక్య స్ట్రాటజీ: కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు
నాగన్న సర్వే: కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 8 శాతం ఓట్లు
JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, BRS 41.5%, బీజేపీ 11.5% ఓట్లు
స్మార్ట్ పోల్: కాంగ్రెస్ 48.2, బీఆర్ఎస్ 42.1 శాతం ఓట్లు
-హెచ్ఎంఆర్ సర్వే: కాంగ్రెస్‌కు 48.3%, బీఆర్ఎస్‌కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు లభించే అవకాశముందని పేర్కొంది.

కాగా, ఈ సంవత్సరం జూన్‌లో BRS సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. గులాబీ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య సునీతా గోపీనాథ్‌ను పోటీకి దింపగా, నవీన్ యాదవ్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ తరుపున దీపక్ రెడ్డి పోటీ చేశారు. AIMIM కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ప్రకారం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు, వీరిలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.