Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఝార్ఖండ్‌లో పదివేల మందికి పైగా మావోయిస్టులు అరెస్టు!

Share It:

రాంచీ: ఝార్ఖండ్‌లో 2001 నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు అంటే ఈ 25ఏళ్లలో మొత్తం 10వేల769 మంది మావోయిస్టులు అరెస్టు చేసారు. కాగా, 235 మంది మృతి చెందారు. 324 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ కాలంలో పోలీసులు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. “గత 25 సంవత్సరాలలో పోలీసుల నుండి దోచుకున్న 710 ఆయుధాలతో సహా 1,471 తుపాకులను స్వాధీనం చేసుకున్నారని” ఆయన చెప్పారు.

“ఝార్ఖండ్‌ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం. 2016లో ఆ రాష్ట్రంలోని 24 జిల్లాలలో 22 జిల్లాలు నక్సల్స్ ప్రభావితమయ్యాయి. జార్ఖండ్ పోలీసులు, కేంద్ర దళాలు, నిఘా సంస్థలతో కలిసి, గత 25 సంవత్సరాలుగా మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నారు. దీని ఫలితంగా 2001 నుండి 10,769 మంది నక్సల్స్, వారి మద్దతుదారులను అరెస్టు చేశారు. అంతేకాకుండా, ఈ కాలంలో 324 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 235 మందిని భద్రతా దళాలు చంపేశాయని ఐజిపి (ఆపరేషన్స్),జార్ఖండ్ పోలీసు ప్రతినిధి మైఖేల్ రాజ్ విలేకరులకు తెలిపారు.

ప్రస్తుతం, నాలుగు జిల్లాలు మాత్రమే మావోయిస్టుల ప్రభావానికి లోనయ్యాయి. “ఒక జిల్లా చైబాసా, ప్రధానంగా ప్రభావితమైంది, మరో మూడు జిల్లాలు మావోయిస్టు చీలిక గ్రూపుల దాడులకు గురవుతున్నాయి” అని ఆయన జోడించారు.

ఈ కాలంలో రాష్ట్రంలో మావోయిస్టులతో పోరాడుతూ మొత్తం 555 భద్రతా సిబ్బంది మరణించారని ఐజిపి చెప్పారు, వీరిలో 408 మంది రాష్ట్ర పోలీసులు, 147 మంది కేంద్ర బలగాలు ఉన్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ వరకు జార్ఖండ్ అంతటా 266 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా… 32 మంది మృతి చెందారు. 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారు.

ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, CPI (మావోయిస్ట్), దాని చీలిక గ్రూపులకు చెందిన తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టయిన వారిలో ఉన్నారు.

పోలీసుల డేటా ప్రకారం… గత తొమ్మిది నెలల్లో పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కాట్రిడ్జ్‌లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. 37 మావోయిస్టు బంకర్లను ధ్వంసం చేశారు.

కాగా, జార్ఖండ్‌లో ప్రస్తుతం 584 పోలీస్ స్టేషన్లు, 91 పోలీస్ అవుట్‌పోస్టులు ఉన్నాయి. మానవశక్తి విషయానికొస్తే… ఇది 2001లో 29,295 నుండి 2025లో 79,035కి పెరిగిందని ఆయన తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.